సమ్మెకు తాత్కాలిక బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు తాత్కాలిక బ్రేక్‌

Jul 4 2025 3:32 AM | Updated on Jul 4 2025 3:32 AM

సమ్మెకు తాత్కాలిక బ్రేక్‌

సమ్మెకు తాత్కాలిక బ్రేక్‌

● రిలే దీక్షలు కొనసాగించనున్న స్విమ్స్‌ కార్మికులు

తిరుపతి తుడా : విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన స్విమ్స్‌ కార్మికుల దెబ్బకు అధికారులు దిగొచ్చారు. కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి గురువారం స్విమ్స్‌ డైరెక్టర్‌ ఆర్వీ కుమార్‌, ఏఎస్పీ మనోహరాచారి, ఆర్డీఓ రామ్మోహన్‌ చేరుకుని కార్మికుల డిమాండ్లు న్యాయ పరమైనవేనని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరవధిక సమ్మెను కార్మికులు తాత్కాలికంగా విరమించుకుని రిలే నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు ప్రకటించారు.

అత్తపై అల్లుడు దాడి

అత్తకు తీవ్ర గాయాలు

నాయుడుపేటటౌన్‌ : అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి అత్త ప్రశ్నించిదనే కోపంతో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. అగ్రహారపేటకు చెందిన మహేశ్వరి, ఆమె కుమార్తె మునికుమారిని తాళ్లురు రవీంద్రనాథ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే రవీంద్రనాథ్‌ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని అల్లుడిని అత్త నిలదీసింది. దీంతో అత్తపై కోపంతో బుధవారం రాత్రి అగ్రహారపేటలో అత్త మహేశ్వరి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తిరుపతి వైద్యశాలకు తరలించారు. బాధితురాలి భర్త మునీంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాబి తెలిపారు.

ఆటో బోల్తా..: వృద్ధుడి మృతి

గూడూరు రూరల్‌ : ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని విందూ రు గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు విందూరు ఎస్టీ కాలనీకి చెందిన చిల్లకూరు చెంచయ్య(69) సైదాపురం మండలం జోగిపల్లిలో పీర్ల ఉత్సవానికి మేళం వాయించేందుకు మరో నలుగురితో కలసి ఆటోలో బయలుదేరాడు. గ్రామ సమీపంలోని చర్చి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చెంచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గూడూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement