
గ్యాస్ ట్యాంకర్ బోల్తా
ఓజిలి: నెల్లూరు– చైన్నె జాతీయ రహదారిపై పెదపరియ క్రాస్ సమీపంలో బుధవారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్ నుంచి చైన్నెకు గ్యాస్‌లోడ్‌తో లారీ వెళుతోంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగింది. అయితే గ్యాస్ లీక్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కాలువ కట్ట కింద మృతదేహం
డక్కిలి : మండల కేంద్రానికి సమీపంలో తెలుగు గంగ కాలువ కట్ట కింద ఓ వృద్ధుడి మృతదేహాన్ని బుధవారం ఆలస్యంగా గుర్తించారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో కట్టపై వాకింగ్ చేస్తున్న వారు అక్కడి ముళ్లపొదల్లో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శివ శంకర్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అన్నంరాజుపల్లెకు చెందిన కోండూరు రవీంద్రరాజు (60)గా గుర్తించారు. మృతుడు రెండు రోజులు కిందట దేవునివెల్లంపల్లి స్తంభాలగిరీశ్వరయ్యస్వామి ఆలయంలో అవధూత గురుకల పోలయ్యస్వామి ఆరాధన మహోత్సవానికి వచ్చాడని, అతిగా మద్యం తాగడంతో మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

గ్యాస్ ట్యాంకర్ బోల్తా