
స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ వైఖరి స్పష్టమయ్యాకే నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. వాస్తవానికి 25న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పటికీ శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ విషయంలో ఆ పార్టీ వైఖరి స్పష్టం కాలేదు.
ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన ఉన్నప్పటికీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం పార్టీ తన వైఖరిని అధికారికంగా ప్రకటించనుంది ఈ నేపథ్యంలో పార్టీ వైఖరి స్పష్టమైన తర్వాతే కేబినెట్ భేటీ జరిపి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.