
స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఖరారు చేసే అవకాశం
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపైనా నిర్ణయం
కాళేశ్వరం కమిషన్, పంట నష్టపరిహారంపై నిర్ణయం తీసుకొనే అవకాశం
ఈ నెల 29 నుంచి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ భేటీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 25వ తేదీ మధ్యా హ్నం 2 గంటల కు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్ని కలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, కాళేశ్వరం కమిషన్ నివే దిక తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై చర్చించి, పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందించే విషయంపై నిర్ణ యం తీసుకోనున్నట్లు తెలిసింది. యూరియా కొరతపై కూడా చర్చించనున్నట్లు సమా చారం.
ముఖ్యంగా హైకోర్టు తీర్పు మేరకు వచ్చే నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నిక లు నిర్వహించాల్సి ఉన్నందున.. ఈ ఎన్నికల తేదీలను మంత్రివర్గం ఖరారు చేసే అవ కాశం ఉంది. శనివారం జరిగే కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వెల్లడయ్యే అభిప్రాయాలకు అనుగుణంగా కేబినెట్‌లో స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు కూడా ఈ సమావే శంలోనే ఖరారు కానున్నాయి. ఈ నెల 29 నుంచి లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సమావేశాలు వారం పాటు నిర్వహిస్తారని, కాళేశ్వరం ప్రాజెక్టు పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశాలే ఎజెండాగా సమావేశా లు ఉంటాయని తెలిసింది. ఘోష్ కమిషన్ నివేదికపై తీసుకోవాల్సిన చర్యలు, హైకోర్టు లో కౌంటర్ దాఖలుపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.