కనులపండువగా మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: యోగి వేమన ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో తెలుగు కవి వేమనకు రెండు వందల సంవత్సరాలుగా ఆలయం నిర్మించి పూజిస్తున్నారు. ఇటీవల ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామీణుల నిధుల సాయంతో ఆలయం నిర్మించారు. కొత్తగా వేమన 4 అడుగుల విగ్రహం ప్రతిష్టించి ఆలయ మహాకుంభాభిషేకం శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం మేళతాళాల నడుమ పవిత్ర పుణ్యతీర్థాలు తరలించి యోగి వేమన విగ్రహానికి పవిత్ర జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కనులపండువగా మహాకుంభాభిషేకం


