విశాల్‌కు జంటగా మిల్కీబ్యూటీ?
తమిళసినిమా: నటుడు విశాల్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న మకుడం చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా దీని తర్వాత మరో కొత్త చిత్రానికి కమిట్ అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి సుందర్. సి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈయన రజనీకాంత్ కథానాయకుడిగా కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడిన తరుణంలో అనూహ్యంగా దర్శకుడు సుందర్.సి ఆ చిత్రం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విశాల్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఇందులో తమన్నా కథానాయకిగా నటించనున్నట్లు తెలిసింది. 6 ఏళ్ల తర్వాత మళ్లీ మరోసారి వీరిద్దరూ జత కట్టడానికి సిద్ధమవుతున్నారు, అదేవిధంగా సుందర్.సి దర్శకత్వంలో ఇంతకుముందు అరణ్మణై–4 చిత్రంలో తమన్నా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే మదగజరాజా వంటి హిట్ చిత్రం తర్వాత విశాల్, సుందర్.సి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సుందర్.సి, నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్న మూక్కుత్తి అమ్మన్–2 చిత్తానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పూర్తి చేసిన తర్వాత విశాల్ హీరోగా నటించే చిత్రానికి ఈయన దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
విశాల్‌కు జంటగా మిల్కీబ్యూటీ?


