
గాయని ఎస్పీ శైలజకు శ్రీకాంత పురస్కారం ప్రదానం
కొరుక్కుపేట: తెలుగు తరుణి 10వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చైన్నె టి.నగర్‌లోని జీఎన్ చెట్టి రోడ్డులోని సర్ పిట్టి త్యాగరాయర్ హాలు లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేపథ్యగాయని ఎస్పీ శైలజ విచ్చేశారు. గౌరవ అతిథిగా చైన్నె, ఆకాశవాణి, ప్రోగ్రామ్స్ హెడ్, (రిటైర్డ్) డాక్టర్ జి లలిత పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా డాక్టర్ ఉష అయ్యగారి, రచయిత్రి లింగమనేని సుజాత విచ్చేశారు. ఇందులో గాయని ఎస్పీ శైలజకు శ్రీకాంత’ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఇందులో తెలుగు మాధ్యమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.