
కౌన్సెలింగ్ వేళాయె
● నేటి నుంచి బీఈ, బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియ
● 14 నుంచి జనరల్ కౌన్సెలింగ్
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ కోటాసీట్ల భర్తీ నిమిత్తం కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి రిజర్వుడ్ కోటా బీఈ, బీటెక్ కోర్సుల సీట్ల భరత జరగనున్నది. 14 నుంచి జనరల్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. వివరాలు.. రాష్ట్రంలో అన్నావర్సిటీ, సాంకేతిక విద్యా డైరెక్టరేట్ పరిఽధిలో ఉన్న 430 మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో కౌన్సెలింగ్ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల ఆధారంగా ర్యాండం నెంబర్లను ప్రకటించారు. ప్లస్–2 మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి ర్యాంకుల జాబితాను సిద్ధం చేశారు. గత నెలాఖరులో సాంకేతిక విద్యా డైరెక్టరేట్‌లో ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ ర్యాంకుల జాబితాను ప్రకటించారు.
నేటి నుంచి కౌన్సెలింగ్
ప్రభుత్వ కోటాలోని సుమారు రెండు లక్షల సీట్ల భర్తీ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానించగా, 3,02,374 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 2 లక్షల 50 వేల 298 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. గత ఏడాది కంటే ఈసారి 40,645 మంది అదనంగా నమోదు చేసుకున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన వారిలో మొత్తం 2 లక్షల 41 వేల 641 మంది ఉన్నారు. వీరిలో రిజర్వుడ్ కోటా క్రీడలు, దివ్యాంగులు, మా జీ సైనికులు తదితర సీట్ల భర్తీ సోమవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ర్యాంకుల జాబితా, ర్యాండం నెంబర్ల ఆధారంగా కౌన్సెలింగ్ తేదీలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే తెలియజేశారు. ఆన్‌లైన్ ద్వారా సోమవారం నుంచి ఐదు రోజులు రిజర్వుడ్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ జరగనుంది. ఆ తర్వాత జనరల్ కోటా కౌన్సెలింగ్ జూలై 14 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అనుబంధ కౌన్సెలింగ్ ఆగస్టు 21 నుంచి 23 వరకు జరుగనుంది.
అన్నాయూనివర్సిటీ