
10 వేల గ్రామాల్లో సభలకు కార్యాచరణ
ఏర్పాట్లలో టీవీకే
సాక్షి, చైన్నె : పది వేల గ్రామాల్లో సభల నిర్వహణకు తమిళ వెట్రి కళగం (టీవీకే) నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆదేశాలతో ఏర్పాట్లపై దృష్టి సారించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ప్రకటించి కార్యక్రమాలను విజయ్ విస్తృతం చేసిన విషయం తెలిసిందే. పార్టీకి సంబంధించిన సమగ్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు. పదవులన్నీ భర్తీ అయ్యాయి. ఇక, ప్రజలతో మమేకం అయ్యేలా విజయ్ రాష్ట్ర పర్యటన కసరత్తులు జరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షణలో రూట్ మ్యాప్ రూపకల్పన తుది దశలో ఉన్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెలాఖరులో లేదా ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో జనంలోనే విజయ్ ఉండబోతున్నారన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. అదే సమయంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా పది వేల గ్రామాల్లో సభల నిర్వహణ లక్ష్యంగా పార్టీ వర్గాలకు విజయ్ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ సభల నిర్వహణ, విజయ్ రూట్ మ్యాప్‌పై తుది కసరత్తులు ముగించి, ప్రజలలోకి చొచ్చుకెళ్లేలా శుక్రవారం టీవీకే వర్గాలు చైన్నెలో సమావేశం కానున్నాయి. పనయూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి వెయ్యి మంది ప్రతినిధులను ఆహ్వానించి ఉండడం గమనార్హం. ఈ సమావేశానంతరం విజయ్ రాష్ట్ర పర్యటన వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
వోక్స్ వ్యాగన్‌లో ఆటో ఫెస్ట్
సాక్షి, చైన్నె : వోక్స్ వ్యాగన్ ఇండియా ఆటో ఫెస్ట్ – వార్షిక నేషనల్ ఎకై ్స్చంజ్ కార్నివాల్‌కు సిద్ధమైందని ఆ సంస్థ బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లి తెలిపారు. గురువారం ఈ వివరాలను స్థానికంగా ఆయన ప్రకటించారు. వోక్స్ వ్యాగన్ కారుకు అప్ గ్రేడ్ చేసుకోవడానికి, పరిమిత కాల సేవా ప్రయోజనాలను పొందడానికి, పాత కార్లతో సహా అప్ గ్రేడ్ ఆఫర్‌లను పొందడానికి ఒక ప్రత్యేక అవకాశంగా ఆటో ఫెస్ట్‌కు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆకర్షణీయమైన మార్పిడి, లాయల్టీ రివార్డులు, ప్రత్యేక ఆర్థిక ఎంపికలు, ఉచిత వాహన మూల్యాంకనం, టెస్ట్ డ్రైవ్, ప్రత్యేక సేవ, నిర్వహణ ప్రయోజనాలు ఈ ఫెస్ట్‌లో ఉంటాయని పేర్కొన్నారు. బలమైన సర్వీస్ నెట్ వర్క్, జర్మన్‌ఇంజనీరింగ్ అందించడంలో నిరంతర దృష్టిని ఆటో ఫెస్ట్ ప్రతిబింబిస్తుందన్నారు.
ప్రచార పర్యటన కోసం మిత్రులకు ఆహ్వానం
●ఒకే వేదికపైకి పళణి, నైనార్
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్యటన ప్రారంభోత్సవానికి తరలి రావాలని బీజేపీ నేతలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పిలుపు నిస్తున్నారు. కోయంబత్తూరు వేదికగా పళణి స్వామితో పాటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కనిపించనున్నారు. అధికారం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టిన పళణి స్వామి ఈనెల 7వ తేదీ నుంచి ప్రచార పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కోయబంత్తూరు జిల్లా మేట్టుపాళయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పర్యటన మొదలు కానున్నది. తొలి విడత పర్యటన ఈనెల 23వ తేదీ వరకు జరగనుంది. ఈ ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమంలో బలాన్ని చాటే దిశగా పళణి వ్యూహర చన చేశారు.ఇందులో భాగంగా తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారికి ఆహ్వానాలు పలికే విధంగా పార్టీ వర్గాల ద్వారా పిలుపు నిచ్చే పనిలో పడ్డారు. అలాగే, తమప్రధాన మిత్ర పక్షం బీజేపీనే తలందర్నీ ఈ కార్యక్రమానికి పళణిస్వామి ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌తో పాటుగా ముఖ్య నేతలు పాల్గొనేందుకు సిద్ధమైనట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
కపాలీశ్వర ఆలయానికి
బాంబు బెదిరింపు
కొరుక్కుపేట: చైన్నెలోని మైలాపూర్ కపాలీశ్వర్ ఆలయంకు ఈమెయిల్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులు బాంబు బెదిరింపు పంపారు. దీంతో ఆలయ సిబ్బంది పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. బాంబు నిపుణులు ,స్నిఫర్ డాగ్ ్సతో కలసి ఘటనా స్థలానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కానీ బాంబు కనిపించలేదు. చివరికి అది బెదిరింపు కాల్ అని తేలింది. దీని తర్వాత ఈ– మెయిల్ ద్వారా బెదిరింపు చేసిన యువకుడు ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నారు.

10 వేల గ్రామాల్లో సభలకు కార్యాచరణ