
సీ్త్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే గుడ్ వైఫ్
తమిళసినిమా: నటి రేవతి పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఆమె సహజ నటన. తమిళం, తెలుగు, హిందీ ఇలా చాలా భాషల్లో కథానాయకిగా నటించి తన కంటే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రతిభావంతురాలు ఈమె. నటిగానే కాకుండా నిర్మాత, రచయిత, దర్శకురాలి ఇలా బహుముఖాలు కలిగిన రేవతి తాజాగా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్. నటి ప్రియమణి, సంపత్, ఆరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్‌కు హలిత సమీమ్ కథనం ,మాటలను అందించారు. ఇది హిందీ మొదలగు ఆరు భాషల్లో రూపొందిన వెబ్ సిరీస్‌కు రీమేక్ అన్నది గమనార్హం. కె. సంగీతాన్ని అందించిన ఈ వెబ్ సిరీస్ నిర్మాణ కార ్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకురాలు రేవతి మాట్లాడుతూ తాను ఇంతకు ముందు నాలుగు చిత్రాలకు, షార్ట్స్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించానని, ఒక మోగా సీరియల్‌ను కూడా నిర్మించినట్లు చెప్పారు. కాగా తమిళంలో తాను దర్శకత్వం వమించిన తొలి వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ అని పేర్కొన్నారు. ఇది ఒక స్ట్రీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే సిరీస్‌గా ఉంటుందన్నారు. భార్యగా, తల్లిగా ,అదే సమయంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే మహిళగా ఎలా కర్తవ్యాన్ని నిర్వహించిందీ అన్న కథాంఽశంతో రూపొందించిన వెబ్ సిరీస్ ఇదని చెప్పారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గం వల్ల తానీ వెబ్ సిరీన్‌ను రూపొందించడానికి ఏమంత కష్టపడాల్సిన అవసరం రాలేదన్నారు. ముఖ్యంగా నటి ప్రియమణి చాలా అంకితభావంతో పని చేశారన్నారు. ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా హాట్‌స్టార్ సంస్థ ఎంతగానో సహకరించినట్లు చెప్పారు. నటి రేవతి దర్శకత్వంలో నటించడం సంతోషకరం అని నటి ప్రియమణి పేర్కొన్నారు. ఆమె దర్శకత్వం శైలి ప్రత్యేకం అనీ, చాలా కామ్‌గా పని చేసుకుపోతారన్నారు.