
ఘనంగా పొన్నియమ్మన్ ఆలయ కుంభాభిషేకం
వేలూరు: కాట్పాడి సమీపంలోని బ్రహ్మపురంలో నూతనంగా నిర్మించిన పొన్నియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేకం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మంగళవారం సాయంత్రం గజపూజ, గణపతి హోమం, యాగశాల పూజ, గోపూజ, వాస్తు శాంతి పూజ నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రత్యేక గణపతి హోమ పూజలు చేసి, వివిధ పుణ్యనదుల నుంచి తీసుకొచ్చిన పుణితజలాలను కలశంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ రాజ గోపురంపైకి తీసుకెళ్లి వేద మంత్రాల నడుమ మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం కలశ జలాలను భక్తులపై చల్లి, దీపారాదన పూజలు చేశారు. తరువాత ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, దీపారాదన పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.