
కోమారి వ్యాధి నిరోధక వ్యాక్సిన్ శిబిరాలు ప్రారంభం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా వున్న బర్రెలు, పశువులకు కోమారి వ్యాధి నిరోధక టీకాలు వేసే శిబిరాలను కలెక్టర్ ప్రతాప్ బుధవారం ఉదయం తన్నీర్‌కుళంలో ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న పశువులు, మేకలు, బర్రెలకు కోమారి వ్యాధి నుంచి రక్షణ కల్పించడానికి టీకాలు వేసే శిబిరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఏడవ దశ టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతాప్ తన్నీర్‌కుళంలో ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2లక్షల 79వేల 550 పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వివరించారు. ఈ శిబిరాలను జూలై రెండు నుంచి 30 లోపు వందశాతం టీకాలు వేసే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.