
వైభవంగా కుంభాభిషేకం
తిరువళ్లూరు: పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వేంబులీ అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన వేంబులీ అమ్మవారి ఆలయం వుంది. ఆలయంలో ఇటీవల జీర్ణోద్దరణ పనులను చేపట్టారు. పనులు పూర్తయిన క్రమంలో కుంబాబిషేకం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గత 29న ఉదయం 9 గంటలకు మంగళపూజ, దీపపూజ, విఘ్నేశ్వరపూజ, ధనపూజ, గణపతిహామం, లక్ష్మీహోమం, నవగ్రహా పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు వాస్తుశాంతి ప్రవేశబలి తదితర పూజల నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం ఉదయం 9 గంటలకు ధీపారాధన పూజ, ప్రసాదం పంపిణీ నిర్వహించారు. సాయంత్రం యాగశాల పూజలు నిర్వహించారు. మూడవ రోజు మంగళవారం ఉదయం పావనప్రవేశం, హామం, దీపారాధన, పూర్ణహుతి నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు పూర్ణహుతి తదితర పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ఆరు గంటల మహాపూర్ణహుతి, ఏడు గంటలకు ఆలయ గోపురంపై పుణ్యజలాలు వదిలి కుంభాభిషేకం నిర్వహించారు. పూజలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు.

వైభవంగా కుంభాభిషేకం