
ఎనిమిది మంది వైద్యులకు అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: వైద్య రంగంలో విశేష సేవలను అందిస్తున్న ఎనిమిదిమంది వైద్యులను పలు అవార్డులతో ఘనంగా సత్కరించుకున్నారు . జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3233లోని ఆరోగ్య విభాగం తరపున మంగళవారం నగరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు.డిస్ట్రీక్ట్ గవర్నర్ డి దేవేంద్రన్ నేతృత్వంలో హీలర్స్ హార్మోని –రోటరీ ట్రైబ్యూట్ టు డాక్టర్స్ పేరిట ప్రముఖ వైద్యులను అవార్డులతో సత్కరించారు . అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులకు వైద్యశిబిరం , అన్నదానం తదితర కార్యక్రమాలు జరిగాయి . చైన్నె ఎగ్మోర్‌లో జరిగిన వైద్యుల సత్కార కార్యక్రమంలో తమిళనాడు నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి పాల్గొన్న వైద్యులను శాలువాలు , జ్ఞాపికలతో సత్కరించారు. విశిష్ట సేవలను అందించిన ఎనిమిది మంది ప్రముఖ వైద్యులకు అవార్డులను ముఖ్యఅతిథిగా ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్ డాక్టర్ మయిల్ వాహనన్ , గౌరవ అతిధిగా థౌజండ్‌లైట్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఎళిలన్ నాగనాథన్ చేతులమీదుగా ప్రదానం చేశారు . ఇందులో డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్ ఛైర్మెన్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ రేలా ,అస్సాంకు చెందిన వైద్యులు డాక్టర్ రవికన్నన్ లకు ఫర్ ది షేక్ ఆఫ్ ఆనర్ అవార్డును అందుకున్నారు . అలాగే వైద్యులు డాక్టర్ ఆర్ శ్రీరామ్ , సీనియర్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ మోహన్ రాజన్ , తమిళనాడు ప్రభుత్వ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ టిఎన్ సెల్వ వినాయగంకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోగా , డాక్టర్ ఆర్ ప్రేమ్ శేఖర్, డాక్టర్ వసుమతి వేదాంతంలకువిశిష్ట సేవా అవార్డులు అందుకున్నారు . అలాగే డాక్టర్ కార్తీక్ బాలాజీ యంగ్ అచీవర్ అవార్డును అందుకున్నారు .ఈ సందర్భంగా డిస్ట్రీక్ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ తమ సంఘం తరపున మంగళవారం ఒక్క రోజులోనే దాదాపు రూ. 15 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. స్పాట్ ఆసుపత్రి నిర్వాహకురాలు సుజాత రమేష్ బాబుతోపాటూ పెద్దసంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు.