
తక్కువ పెట్టుబడితో ఏర్పాటు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే క్లౌడ్ కిచెన్ ప్రస్తుతం మన నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడకు కూడా విస్తరించింది. ఆన్‌లైన్ ఫుడ్‌కు అధిక ప్రాచుర్యం ఉండడంతో నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీకి చెందిన జ్యోతి ఇంట్లోని వంట గదిని ఫుడ్ డెలివరీ బిజినెస్‌కు అనుకూలంగా మలుచుకుంది. ‘నాటు.. యమ ఘాటు’ పేరుతో జొమాటో, స్విగ్గీ ద్వారా తన ఫుడ్‌ను ఆన్‌లైన్ ద్వారా సప్లయ్ చేస్తున్నారు. ఈమెతోపాటు నల్లగొండలో పలువురు మహిళలు క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఇంట్లో చేసిన వంట కావడంతో చాలా మంది క్లౌడ్ కిచెన్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు.
స్కిల్స్‌తో వ్యాపారం
చేయవచ్చు
వ్యాపారం చేయాలంటే విభిన్న ఆలోచనలతో పాటు అందుకు తగ్గట్టుగా స్కిల్స్ ఉండాలి. అప్పుడే అందులో రాణించ
గలుగుతాం. ప్రస్తుతం మార్కెట్‌లో క్లౌడ్ కిచెన్‌కు మంచి స్పందన వస్తోంది. వంటలో ప్రావీణ్యం
ఉండి సొంతంగా బిజినెస్ చేయాలనుకునే వారికి క్లౌడ్ కిచెన్ సదవకాశం. మూడు నెలల క్రితం నేను క్లౌడ్ కిచెన్ ప్రారంభించాను. ప్రస్తుతం రోజుకు 10 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. దీనికి లొకేషన్‌తో సంబంధం లేదు. జనం రద్దీగా ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉంటే మంచిది. జొమాటో, స్విగ్గీ డెలివరీ ఆప్షన్ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఫుడ్, కిరాణా డెలివరీతో పాటు క్లౌడ్ కిచెన్ వ్యాపారం కూడా పుంజుకుంటోంది.
– బి.జ్యోతి, క్లౌడ్ కిచెన్ నిర్వాహకురాలు, నల్లగొండ
ఆన్‌లైన్ డెలివరీలు మాత్రమే..
సాధారణంగా రెస్టారెంట్ ఏర్పాటు చేయాలంటే.. వంట బాగా వచ్చిన వారిని పెట్టుకోవాలి. అది బోలెడంత
ఖర్చుతో కూడుకున్న పని కావడంతో చాలా వరకు హోటల్ బిజినెస్ చేయాలనుకునే వారు వెనకడుగు వేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే క్లౌడ్ కిచెన్‌లు. క్లౌడ్ కిచెన్ ద్వారా కేవలం ఆన్‌లైన్ డెలివరీ మాత్రమే ఉంటుంది. ఆన్‌లైన్ ఆర్డర్లకై తే పెద్ద భవనం అవసరం లేదు. ఖరీదైన ఫర్నిచర్, వెయిటర్లు.. ఇలాంటి ఖర్చులేవీ ఉండవు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి పెద్దపెద్ద
నగరాల్లో క్లౌడ్ కిచెన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చిన్నచిన్న పట్టణాలకు విస్తరిస్తున్నాయి. క్లౌడ్ కిచెన్‌లో బిర్యానీ దగ్గర్నుంచి కూరలు, టిఫిన్లు, స్వీట్లు ఇలా ఎన్నో రకాల వంటకాలు ఆన్‌లైన్ ద్వారా లభిస్తున్నాయి.