
సంస్కృత విద్యా పీఠం సందర్శించిన ఈఓ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్కృత విద్యా పీఠాన్ని, వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిల్ప కళాశాలను ఈఓ వెంకట్రావ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా శిల్ప కళాశాలలోని వసతులు, బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సు వివరాలను ప్రిన్సిపాల్ మోతీ లాల్‌ను అడిగి ఈఓ తెలుసుకున్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న టెంపుల్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్, రాతి, సిమెంట్‌తో చేసే విధానాన్ని ఈఓకు వివరించారు. అనంతరం సంస్కృత విద్యా పీఠానికి వెళ్లి విద్యార్థులు, బోధకులతో మాట్లాడారు. ఈ విద్యా పీఠంలో ఎంతో సామాజిక స్పృహతో అన్ని కులాల వారికి సంస్కృత భాషా జ్ఞానం కల్పించి, దినదినాభివృద్ధి చెందుతుందని ఈఓ తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, సంస్కృత విద్యా పీఠం, శిల్పా కళాశాల బోధకులున్నారు.