
పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌ను చివ్వెల మండల పరిధిలోని జి.తిర్మలగిరి రైతువేదికలో కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి దిగుబడులు సాధించాలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో పంటలు సాగు చేయాలన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రైతు భరోసా పంటల సాగు పెట్టుబడులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మండల ప్రత్యేకాఽధికారి జగదీశ్వర్ రెడ్డి, ఏఓ వెంకటేశ్వర్లు ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 15నాటికి భూ దరఖాస్తుల పరిష్కారం
భానుపురి (సూర్యాపేట) : భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా జిల్లావ్యాప్తంగా వచ్చిన 44,741 దరఖాస్తులను ఆగస్టు 15నాటికి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తేజస్‌నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ కే.రామకృష్ణారావు.. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సమీక్షించడానికి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. టీబీ ముక్త్ భారత్ లో భాగంగా స్క్రీనింగ్ పెంచాలని, అనుమానితులకు ఎక్స్‌రేలు తీసి లక్షణాలు బయట పడితే తక్షణం చికిత్సలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వివి అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్‌కుమార్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీహెచ్‌ఓ నాగయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్ర శేఖర్, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫొటొఫైల్‌నెం:24ఎస్‌పిటి252
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్