
బడుల పర్యవేక్షణకు టీచర్లు
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పలు మార్పులు తీసుకొస్తోంది. విద్యావ్యవస్థను గాడిలో పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థకు అదనంగా ఉపాధ్యాయులతోనే పాఠశాలలు తనిఖీలు చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలలను ఎస్‌జీటీలతో, యూపీఎస్, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌లతో తనిఖీలు చేయనున్నారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉపాధ్యాయుల సంఖ్యలో 2శాతం
మందిని నియమించే యోచన
జిల్లాలో 182 జెడ్పీ ఉన్నత పాఠశాలలు, 78ప్రాథమికోన్నత , 690ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,790 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయితే జిల్లాలో పని చేస్తున్న మొత్తం ఉపాధ్యాయుల్లో రెండు శాతం మందిని తనిఖీ అధికారులుగా నియమించాలనే నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమించడం సరికాదంటున్నారు. ఏడాదిపాటు టీచర్లను బోధనకు దూరం చేసి తనిఖీ అధికారులుగా నియమిస్తే విద్యార్థులకు నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
ఫ విద్యావ్యవస్థలో పెను మార్పులు
తీసుకురావాలని సర్కారు యోచన
ఫ ఈ ప్రకటనతో ఉపాధ్యాయ
వర్గాల్లో భిన్నాభిప్రాయాలు