
ఆదిలోనే విపత్తి
వరుణదేవా.. కరుణించవా
తిరుమలగిరి (తుంగతుర్తి): వానాకాలం సీజన్ మొదలై రెండు వారాలు దాటినప్పటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలోని 8వ వార్డులో మహిళలు వర్షం కురిపించాలని వరుణ దేవుడిని వేడుకుంటూ పాటలు పాడుతూ చుట్టు కాముడు ఆడారు.
ఫ జిల్లాలో 26వేల ఎకరాల్లో పత్తి సాగు
ఫ ముందస్తు వానలకు విత్తనాలు
వేసిన రైతులు
ఫ పక్షం రోజులుగా
ముఖం చాటేసిన వరుణుడు
ఫ సగానికి పైగా మొలకెత్తని గింజలు
ఫ అక్కడక్కడ వచ్చిన మొలకలు వాడు దశకు..
ఫ ఆందోళనలో కర్షకులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు చిత్తలూరి వెంకన్న ది ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రం. ఈ రైతు తనకున్న ఎకరం భూమిలో పది రోజుల క్రితం పత్తి విత్తనాలు విత్తుకున్నాడు. తర్వాత చిరుజల్లులు కురవగా కేవలం 30 శాతం మాత్రమే గింజలు మొలిచాయి. మిగతా గింజలు పాడైపోగా మొలిచిన గింజలు సైతం కొన్ని ఎండ తీవ్రతకు వాడిపోయాయి. దీంతోమరోసారి భూమిని దున్ని విత్తనాలు విత్తుకోవాలా..? లేదంటే గింజలు పాడైపోయిన చోట విత్తుకోవాలా.. ? అన్నది తేల్చుకోలేకపోతున్నాడు. ఇదే పరిస్థితి జిల్లాలోని చాలామంది రైతులకు ఎదురైంది.
భానుపురి (సూర్యాపేట) : ముందస్తుగానే మురిపించిన వర్షాలు.. పక్షం రోజులు జాడలేకుండాపోయాయి. వేలాది ఎకరాల్లో విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో మరోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడక్కడ మొలిచిన పత్తి మొక్కలు ఎండ వేడిమికి వాడుపడుతున్నాయి. సీజన్‌్ ప్రారంభంలోనే ప్రకృతి సహకరించడం పోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
26,364 ఎకరాల్లో పత్తి సాగు
వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల్లో వరి తరువాత పత్తిదే అగ్రస్థానం. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 91వేల ఎకరాల్లో పత్తి సాగు కానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు సకాలంలో, సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు ఆశాభావంతో సాగు పనులపై దృష్టి సారించారు. మే చివరి వారంలో కురిసిన తొలకరి వానలు, జూలై మొదటి వారంలో కురిసిన మోస్తరు వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రైతులు 26,364 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. ఆ తరువాత పక్షం రోజులుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడక్కడ అడపాదడపా జల్లులు మాత్రమే పడ్డాయి. దీంతో సగానికి పైగా విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ కొంత మేర మొలకెత్తాయి. పది రోజులుగా ఎండ తీవ్రత పెరగడం, వేడి గాలులు వీస్తుండడంతో గింజలు భూమిలోనే మాడిపోయే ప్రమాదం ఏర్పడింది. వచ్చిన మొలకలు సైతం ఎండ వేడికి వాడు పడుతుండటంతో కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. నేల గట్టిపడకుండా గుంటుకలు తోలుతున్నారు. మొలకెత్తని చోట మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి రెండోసారి వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చు
పత్తి సాగు చేయడానికి రైతులు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెటుబడి పెట్టారు. దున్నకాలు మొదలుకొని విత్తనాలు వేసే వరకు ఎకరానికి రూ.15 వేలకు పైనే పెట్టుబడి పెట్టారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురువకపోతే ఇబ్బందులు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
జూన్ మాసంలో ఇప్పటివరకు 62.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 15.6 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. నైరుతి రుతు పవనాలు వచ్చే జూన్ మాసంలో కురిసే వర్షమే రైతులకు మంచి ఆధారం. ఈ నెలలోనే వర్షాలు లేకపోవడంతో సాగు కుంటుపడింది.
సాగు ఖర్చులు ఎకరానికి.. (రూల్లో)
ఎరువులు 5,000
ఎరువు చల్లడం 1,000
దున్నకాలకు 3,000
అచ్చు తోలుటకు 1,000
విత్తనాలు (రెండు ప్యాకెట్‌లు) 3,000
కూలీలకు 1,200
కలుపు మందు 2,000

ఆదిలోనే విపత్తి

ఆదిలోనే విపత్తి

ఆదిలోనే విపత్తి

ఆదిలోనే విపత్తి