
అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలు సీజ్
గరిడేపల్లి: మండల పరిధిలోని చవ్వారిగూడెం గ్రామంలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మిర్యాలగూడ శివారులోని తుమ్మడం గ్రామానికి చెందిన కొంత మంది చవ్వారిగూడెం గ్రామం నుంచి అనుమతులు లేని విత్తన బస్తాలను ఆటోలో తీసుకెళ్తుండగా నేరేడుచర్ల పట్టణ శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీయగా అనుమతులు లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈమేరకు గరిడేపల్లి మండలం వ్యవసాయ అధికారి ప్రీతమ్‌కుమార్, హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో చెవ్వారిగూడెం గ్రామానికి వెళ్లి తిప్పన రాంరెడ్డికి చెందిన గోదాంలో తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ఉన్న 150బస్తాల వరి విత్తనాలను సీజ్ చేశారు. కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్, గరిడేపల్లి ఏఎస్‌ఐ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
దిర్శించర్లలో 273 క్వింటాళ్లు పట్టివేత
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన ఎస్‌కె జలీల్‌కు చెందిన షెడ్డులో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 273 క్వింటాళ్ల వరి విత్తనాలను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. సమాచారం మేరకు హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్, వ్యవసాయ అధికారి జావిద్ తనిఖీలు చేసి, వాటిని పట్టుకున్నారు. ఈమేకు షెక్ జలీల్‌పై కేసు నమోదు చేసి, వరి విత్తనాలను పరీక్షల నిమిత్తం విత్తనాల ల్యాబబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. నిఽందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.