
స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం
సూర్యాపేటటౌన్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికలు కావాలని మొదటి నుంచి బీఆర్ ఎస్ కోరుతోందన్నారు. కాంగ్రెస్‌కు చరమగీతం పాడేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు వేదిక కానున్నాయన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. గతంలో జరిగిన కులగణనలో కూడా బీసీల జనాభాను తగ్గించి 56శాతంగా చూపించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీసీలకు మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థమాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, పుట్ట కిషోర్, నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, మడిపల్లి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
ఫబీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
బడుగుల లింగయ్యయాదవ్