రకరకాలు.. | - | Sakshi
Sakshi News home page

రకరకాలు..

Apr 2 2023 1:44 AM | Updated on Apr 2 2023 1:44 AM

పూండి వారపు సంతలో విక్రయానికి ఉంచిన మట్టి కుండలు  - Sakshi

పూండి వారపు సంతలో విక్రయానికి ఉంచిన మట్టి కుండలు

●సహజసిద్ధమైన మట్టి నుంచి తయారు చేసే కుండలకు ప్రాచీన కాలం నుంచి ప్రాధాన్యత ఉంది.

●సంతలు నుంచి పట్టణాల్లో ఉన్న ఫుట్‌పాత్‌ల వరకు మట్టి కుండల వరుసలు దర్శనమిస్తున్నాయి. వీటికి డిమాండ్‌ కూడా ఎక్కువ.

●కుండ పరిమాణం బట్టి రూ.200 నుంచి రూ.2500 వరకు అమ్ముడుపోతున్నాయి. వేసవిలో వారపు సంతల్లో దాదాపు రూ.50 లక్షల వరకు వ్యాపారం సాగుతుంది.

●మట్టి కుండల్లో రకరకాలు ఉన్నాయి. ప్రధా నంగా ఎర్తన్‌వేర్‌, స్టోన్‌ వేర్‌, పోర్సీలేన్‌, టెర్రీకా ట్‌ పాట్స్‌, ప్లాంటర్స్‌ పాట్స్‌, ఫ్లేమ్‌వేర్‌ పాట్స్‌ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇవికాక ప్రము ఖ ఈ–కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఈజీబై, తదితర ఆన్‌లైన్‌ సైట్‌లలోనూ మట్టి కుండలు లభ్యమవుతున్నాయి. టెక్నాలజీ, సై జు, మట్టి ప్రాధాన్యత బట్టి వీటి ధర రూ.180 నుంచి రూ.1550 వరకు అందుబాటులో ఉన్నాయి.

●వారపు సంతల్లో విక్రయించే ఎర్తన్‌వేర్‌ కుండలకు అధిక ప్రాధాన్యత ఉంది. వీటిని తక్కువ వేడిలో మండించి తయారు చేస్తారు.

ప్రయోజనాలు ఎన్నో..

●మలినాలను పీల్చుకుని నీటిని చల్లగా మార్చే అద్భుత శక్తి మట్టి కుండకు మాత్రమే ఉంది.

●ఎండలో నుంచి వచ్చి కుండ నీటితో ముఖం కడుక్కుంటే ఆహ్లాదంతో పాటు వడ దెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు.

●కుండనీటిలో సహజమైన మినరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయి. రోగ నిరోధక శక్తి మెరుగుపడి జీవక్రియలను పెంచుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది.

●దగ్గు, ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు దరి చేరవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement