
కనుల పండువగా ఆషాఢ ఏకాదశి
ప్రశాంతి నిలయం: సత్యసాయి భక్తుల నడుమ ప్రశాంతి నిలయంలో ఆషాఢ ఏకాదశి వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఆదివారం ఉదయం మహారాష్ట్ర, గోవా సత్యసాయి భక్తులు సాయిని కీర్తిస్తూ దిండి పల్లకీని ఊరేగింపుగా మహాసమాధి చెంతకు తీసుకువచ్చారు. పాండురంగడు.. సత్య సాయిల అవతార లక్ష్యం ఒక్కటేనన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. సనాతన భారత చరిత్రలో అనేకమంది సాధువులు మనిషిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన తీరును చక్కగా వివరించారు. సాయంత్రం మహారాష్ట్ర, గోవా బాలవికాస్ చిన్నారులు ‘వాల్యూస్ వర్సెస్ వాల్యూస్’ పేరుతో మనిషి నిత్య జీవితంలో విలువలు పాటించాల్సిన ఆవశ్యకతను, పురాణాల ఆధారంగా విలువల ప్రాముఖ్యతను వివరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.
ఆకట్టుకున్న సత్యసాయి బాల వికాస్ చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన

కనుల పండువగా ఆషాఢ ఏకాదశి