● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు | Sakshi
Sakshi News home page

● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు

Published Sun, May 5 2024 2:55 AM

● ఐదే

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లి ఊపిరి పీల్చుకుంది. గతంలో టీడీపీ హయాంలో పాలకుల అవినీతి, దోపిడీ, స్వార్థంతో సర్వేపల్లి విలవిల్లాడిపోయింది. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడిన టీడీపీ పాలకులు అభివృద్ధి కంటే జేబులు నింపుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. సిలికా, ఇసుక మాఫియా నుంచి రైస్‌ మిల్లులు, రైతు రథాలు, నీరు–చెట్టు పనుల్లో కమీషన్లు ఇలా నాటి పాలకులతో నియోజకవర్గానికి శాపంగా మారింది. వైఎస్సార్‌సీపీ పాలనలో ఆ చీకటి కాలం తెరలు తెంచుకుని అన్ని వర్గాల, విధాలా అభివృద్ధికి అడుగులు వేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు తొక్కింది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంతో కొత్త ఒరవడి సృష్టించారు. నిధులు సాధించి పెండింగ్‌ పనులను పూర్తి చేసి చూపారు. – సాక్షి ప్రతినిధి, నెల్లూరు

పొదలకూరులోని కిసాన్‌క్రాఫ్ట్‌ ఫ్యాక్టరీ

● సర్వేపల్లి రిజర్వాయర్‌, కండలేరు హైలెవల్‌ కాలువ ఆధునికీకరణ

●సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం ద్వారా సర్వేపల్లికు సాగునీరు

●పొదలకూరులో చెరకు రైతుల

పాతబకాయిల రూ.4 కోట్లు చెల్లింపు

●చుక్కల భూముల సమస్యలకు శాశ్వత

పరిష్కారం

●యంత్ర సేవ పథకంలో 147 మంది

రైతులకు ట్రాక్టర్లు

●ముత్తుకూరులో నాన్‌ఫిషర్‌మెన్‌ ప్యాకేజీకు రూ.36 కోట్లు నిధులు

●మనుబోలు వద్ద ఎన్‌హెచ్‌–16 హైవే పునర్నిర్మాణ పనులు పూర్తి

●వెంకటాచలంలో రూ.925 కోట్లతో క్రిప్కో, బయోసముద్ర బయో ఇథనాల్‌ ప్లాంట్ల నిర్మాణం

●నేలటూరులో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు

●పొదలకూరులో రూ.100 కోట్లతో

కిసాన్‌ క్రాప్ట్‌

●టీడీపీ హయాంలో కమీషన్ల కక్కుర్తి

●సాగునీటి వనరుల అభివృద్ధిని

విస్మరించిన వైనం

●రైతుల పేరుతో రకరకాలుగా అవినీతి

●మిల్లర్లతో మిలాఖత్‌ అయి కమిషన్లతో ధాన్యం ధరలు తగ్గించిన పాలన

●నీరు–చెట్టు, రైతు రథం పథకం పనుల్లో కమీషన్లు

●నాన్‌ఫిషర్‌మెన్‌ ప్యాకేజీ సొమ్ములు స్వాహా

ముత్తుకూరులో పామాయిల్‌ ఫ్యాక్టరీలు

వ్యవసాయానికి, రైతులకు వెన్నుదన్ను

ఐదేళ్లలో సర్వేపల్లి నియోజకవర్గంలో వ్యవసాయరంగానికి, రైతులకు వెన్నుదన్నుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలిచింది.

●ప్రధానంగా పొదలకూరు మండలంలో రూ.39.12 కోట్లతో కండలేరు హైలెవల్‌ కాలువ ఆధునికీకరణ.

● రెండు ప్యాకేజీల కింద రూ.31 కోట్లతో సర్వేపల్లి రిజర్వాయర్‌ ఆధునికీకరణ.

● ఈ పనులు దాదాపుగా పూర్తి కావడంతో వేలాది ఎకరాలు అదనంగా సాగులోకి వస్తున్నాయి. కాలువలకు లైనింగ్‌ పనులు చేపట్టడంతో సాగునీరు సవ్యంగా అందుతుంది. సంగం, నెల్లూరు బ్యారేజీల ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో కనుపూరు కాలువ ద్వారా పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, ముత్తుకూరు, టీపీగూడూరు మండలాల్లో సాగునీటి బెంగతీరింది.

● వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ద్వారా 147 మంది రైతులకు ట్రాక్టర్లను అందజేశారు.

చుక్కల భూములకు

శాశ్వత పరిష్కారం

జిల్లాలో చుక్కల భూములకు ఒక్క జీఓ ద్వారా శాశ్వత పరి ష్కారం లభించింది. 22ఏ నిషేధిత జాబితాలో భూము ల రైతులకు పరిష్కారం లభించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. జిల్లాలో 23,023 మంది రైతులకు సంబంధించిన 43,270 ఎకరాల చుక్కలు భూములు, 2,527 మంది రైతులకు సంబంధించిన 22ఏ నిషేధిత భూములు 3,756 ఎకరాల భూములకు శాశ్వత పరిష్కారం లభించింది.

నాన్‌ఫిషర్‌మెన్‌కు అండదండా

ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు నిర్మాణంతో నిర్వాసితులైన నాన్‌ఫిషర్‌మెన్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. నాన్‌ఫిషర్‌మెన్‌కు పరిహారం భృతి పేరుతో ప్యాకేజీలను టీడీపీ హయాంలో సోమిరెడ్డి బొక్కేస్తే.. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆ ప్రతి కుటుంబానికి న్యాయం చేశారు. నాన్‌ఫిషర్‌మెన్‌ పరిహారంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.36 కోట్లను పంపిణీ చేశారు.

పారిశ్రామికాభివృద్ధి

సర్వేపల్లి నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ఏర్పడిన తర్వాత పరిశ్రమల స్థాపన ఊపందుకుంది. నేలటూరు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌తో పాటు, వెంకటాచలం మండలం సర్వేపల్లిలో రూ.610 కోట్లతో క్రిప్కో బయోఇథనాల్‌ ప్లాంట్‌, రూ.315 కోట్లతో విశ్వసముద్ర బయోఇథనాల్‌ ప్లాంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పొదలకూరు మండలంలో రెండేళ్ల క్రితం వ్యవసాయ పనిముట్లు, యంత్రాల తయారీ కోసం కిసాన్‌ క్రాప్ట్‌ పరిశ్రమను రూ.100 కోట్లతో స్థాపించారు. ఇక్కడ స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను కేటాయించడం విశేషం.

రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత

గత టీడీపీ హయాంలో 2015లో వచ్చిన వరదకు దెబ్బతిన్న మనుబోలు వద్ద ఎన్‌హెచ్‌ 16 హైవే రోడ్డు పనులను రూ.135 కోట్లతో పునర్నిర్మాణం చేసి ప్రారంభించారు. హైవే పనులను పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొనే వారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతులైన అంతర్గత సిమెంట్‌ రోడ్లు, సైడ్‌ డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ.320 కోట్ల పనులను పూర్తి చేశారు. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా సర్వేపల్లిలో పనులు పూర్తికావడం గమనార్హం. నియోజకవర్గంలోని ఒక్క పొదలకూరులోనే రూ.100 కోట్ల వరకు కేటాయించారు.

● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు
1/4

● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు

● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు
2/4

● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు

● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు
3/4

● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు

● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు
4/4

● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement