
సౌతాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టుచాంపియన్‌షిప్‌కు మరొకరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ''మ్యాచ్ వీక్షించడానికి సన్నద్ధమవుతున్న భారత ఆర్మీని చూడండి'' అంటూ ఐసీసీ ఒక వీడియోను ట్విటర్‌లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా తొలిసారి టెస్టు చాంపియన్‌షిప్ ఆడనున్న టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ భారత్ ఆర్మీ అని రాసి ఉన్న జెర్సీని ధరించి ఉత్సాహపరిచారు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ప్రేక్షకులకు అనుమతి ఉండడంతో తాము భారత్‌ను ఉత్సాహపరచడానికి సిద్ధమయ్యామని వీడియోలో పేర్కొన్నారు. భారత్ ఆర్మీ ధరించిన మస్కట్ ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీలైతే మీరు ఓ లుక్కేయండి. ఇక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఉన్నా ఎలాగైనా మ్యాచ్‌ను నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. దానికోసం రిజర్వ్ డేలను కూడా ఐసీసీ అట్టిపెట్టుకుంది. ఇక టీమిండియా ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌తో ప్రాక్టీస్ చేయగా.. మరోవైపు కివీస్ మాత్రం ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకొని మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. భారత కాలామాన ప్రకారం రేపు సాయంత్రం 3.30 గంటలకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది.
చదవండి: నా జీవితంలో పెళ్లి తర్వాత చాలా మార్పులొచ్చాయి: బుమ్రా
కరోనా రూల్స్ బ్రేక్ చేసిన కివీస్ ఆటగాళ్లు.. ఆందోళనలో టీమిండియా
Watch the Bharat Army getting ready to cheer for India at the #WTC21 Final 📣📽️ pic.twitter.com/jiq5YlRBOY
— ICC (@ICC) June 16, 2021