ICC Men's T20 World Cup 2021: Babar Azam Goes in With Shoaib Malik Ahead of Sarfaraz Ahmed in Final 12 - Sakshi
Sakshi News home page

IND Vs PAK: అందుకే జట్టులో మాలిక్‌కు చోటు.. అసలు కారణం చెప్పిన పాక్‌ కెప్టెన్‌

Oct 24 2021 1:32 PM | Updated on Oct 24 2021 4:44 PM

T20 World Cup 2021: Babar Azam goes in with Shoaib Malik ahead of Sarfaraz Ahmed in final 12 - Sakshi

Babar Azam goes in with Shoaib Malik ahead of Sarfaraz Ahmed:   టి20 ప్రపంచ కప్‌ 2021లో దాయాదుల ధూమ్ ధామ్‌కు రంగం సిద్దంమైంది. నేడు (అక్టోబరు 24)న దుబాయ్‌ వేదికగా సాయంత్రం 7: 30 గంటల​కు  భారత్‌- పాక్‌ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత్‌తో తలపడే  జట్టును పాకిస్తాన్‌ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ అనుహ్యంగా చోటు దక్కింది.

అయితే తుది జట్టులో  సర్ఫరాజ్ అహ్మద్‌కు చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ .. మాలిక్‌కు చోటు దక్కడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజాం స్పందించాడు. టీమిండియాతో మ్యాచ్‌కు సర్ఫరాజ్ అహ్మద్‌ని తుది జట్టులో తీసుకుందామని మెదట భావించాము. కానీ అతడి స్ధానంలో అఖరికి మాలిక్‌ను  మేనేజెమెంట్‌ ఎంపిక చేసింది అని బాబర్‌ తెలిపాడు. 

"సర్ఫరాజ్ స్పిన్‌ బౌలింగ్‌కు బాగా ఆడగలడు. ఆతడు భారత్‌పై ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయగలడు. అయితే ఈ మ్యాచ్‌లో మేము అత్యత్తుమ జట్టుతో బరిలోకి దిగాలి అనుకున్నాము. స్పిన్‌ని షోయబ్ మాలిక్ కూడా బాగా ఆడగలడు. కొన్ని సమయాల్లో మాకు పార్ట్‌టైమ్‌ బౌలర్‌గాను మాలిక్‌ ఊపయోగపడతాడు. అందుకే మేము సర్ఫరాజ్ స్ధానంలో మాలిక్‌ని ఎంపిక చేశామని"బాబర్‌ విలేకరుల సమావేశంలో తెలిపాడు.

చదవండి: T20 World Cup 2021 Ind vs Pak: ఆ ముగ్గురి పేరు మీదే ఎ​క్కువ బెట్టింగ్‌లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement