కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది: శుబ్‌మన్‌ గిల్‌ | Shubman Gill Comments On Rohit Sharma And Virat Kohli Retirement Ahead Of India Vs England Test Series | Sakshi
Sakshi News home page

Shubman Gill: కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది

Jun 6 2025 10:24 AM | Updated on Jun 6 2025 11:22 AM

Shubman Gill tight lipped on Virat Kohli And Rohit Sharma replacement

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి సవాల్‌ను ఎదుర్కొనేందుకు శుబ్‌మన్ గిల్ సిద్దమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్‌కు పయనమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేని భారత జట్టును గిల్ ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇంగ్లండ్‌కు బ‌య‌లుదేరే ముందు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుబ్‌మ‌న్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా ఇంగ్లండ్ పర్యటన‌కు సంబంధించి ప‌లు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి రిటైర్మెంట్‌ల‌పై కూడా గిల్ మాట్లాడాడు.

"సాధారణంగా ప్ర‌తీ టూర్‌లోనూ ఒత్తిడి ఉంటుంది. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప‌లక‌డం మాకు నిజంగా గ‌ట్టి ఎదురుదెబ్చ అని చెప్పాలి. వారిద్ద‌రూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు. భార‌త జ‌ట్టుకు ఎన్నో అద్బుత‌మైన విజ‌యాలు అందించారు. వారి స్ధానాల‌ను భ‌ర్తీ చేయ‌డం చాలా క‌ష్టం. 

అయితే రోహిత్, కోహ్లి ఉన్న‌ప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండ‌దు. మా బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను ఇంకా మేము ఖారారు చేయ‌లేదు. అందుకు మాకు ఇంకా రెండు వారాల స‌మ‌యం ఉంది. 

లండ‌న్‌లో 10 రోజుల ప్రాక్టీస్ క్యాంపును నిర్వహిస్తాము. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడతాము. ఆ త‌ర్వాత బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను నిర్ణయిస్తాము అని గిల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌కు తెరలేవనుంది. 

ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement