ఎంజాయ్‌ మూడ్‌లో టీమిండియా.. రోహిత్‌ మాత్రం | Rohit Sharma Begins Training As Indian Team Enjoys Before Sydney Test | Sakshi
Sakshi News home page

ఎంజాయ్‌ మూడ్‌లో టీమిండియా.. రోహిత్‌ మాత్రం

Dec 31 2020 6:43 PM | Updated on Dec 31 2020 7:32 PM

Rohit Sharma Begins Training As Indian Team Enjoys Before Sydney Test - Sakshi

మెల్‌బోర్న్‌ : బాక్సింగ్ డే టెస్ట్‌లో అద్భుత విజ‌యాన్ని నమోదు చేసిన టీమిండియా రెండు రోజుల హాలిడేను ఎంజాయ్ చేస్తుంటే.. రోహిత్ శ‌ర్మ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌ అనంతరం ఆసీస్‌ చేరుకున్న రోహిత్‌ 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకొని బుధవారం సాయంత్రం టీమ్‌తో కలిసిన విషయం తెలిసిందే. కాగా జనవరి 7 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో మ్యాచ్‌కు ఇంకా వారం సమయం ఉండడంతో టీమిండియా ఎంజాయ్‌ మూడ్‌లో ఉంది. (చదవండి : ఆసీస్‌ భయంతోనే వార్నర్‌ను ఆడిస్తుందా?)


కానీ రోహిత్‌ మాత్రం గురువారం మెల్‌బోర్న్‌ మైదానంలో ప్రాక్టీస్‌ కొనసాగించాడు.కొద్దిసేపు బ్యాటింగ్‌.. ఆ తర్వాత క్యాచ్‌ల సాధన చేశాడు. రోహిత్‌కు సాయంగా బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్‌, మ‌రో ముగ్గురు  గ్రౌండ్‌కు వచ్చినట్లు స్పోర్ట్స్ అన‌లిస్ట్ బోరియా మ‌జుందార్ ట్వీట్ చేశారు. ఐపీఎల్లో గాయం కార‌ణంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌తోపాటు తొలి రెండు టెస్ట్‌ల‌కు రోహిత్ దూర‌మ‌య్యాడు. సిడ్నీలో జ‌ర‌గ‌బోయే మూడో టెస్ట్‌కు అత‌డు అందుబాటులో ఉండ‌నున్నాడు. రోహిత్‌ తుది జట్టులోకి రానుండడంతో మయాంక్‌ అగర్వాల్‌ను బెంచ్‌కు పరిమితం చేయనున్నారు. (చదవండి : దుమ్మురేపిన విలియమ్సన్‌‌, రహానే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement