తొమ్మిదేళ్ల తర్వాత ప్రారంభం కానున్న టోర్నీ.. జై షా ట్వీట్‌ వైరల్‌

Jay Shah Tweet Viral ACC Women T20 Championship Returns After 9-years - Sakshi

ACC Women's T20 Championship 2022: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) మహిళల టి20 చాంపియన్‌షిప్‌ టోర్నీ తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. జూన్‌ 17 నుంచి 25 వరకు జరగనున్న ఈ టోర్నీకి మలేషియా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో జరగనున్న మ్యాచ్‌లకు కిన్‌రారా ఓవల్‌, వైఎస్‌డీ యుకెఎమ్‌ ఓవల్‌లు వేదికలు కానున్నాయి. ఈ టర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. యూఏఈ, మలేషియా, ఒమన్‌, ఖతార్‌, నేపాల్‌, హాంకాంగ్‌, కువైట్‌, బహ్రెయిన్‌, సింగపూర్‌, బూటాన్‌లు ఈ లిస్టులో ఉన్నాయి. 10 జట్లు రెండు గ్రూఫులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనుండగా.. రెండు గ్రూఫుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. 

దీనికి సంబంధించి ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ''2013లో చివరిసారి ఏసీసీ మహిళల టి20 చాంపియన్‌షిప్‌ను నిర్వహించాం. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత జూన్‌ 25న టోర్నీ ఆరంభం కానుంది. ఇకపై ప్రతీ ఏడాది నిర్వహించేలా ప్లాన్‌ చేసుకుంటాం. ఆసియాలో మహిళల క్రికెట్ అభివృద్ధికి ఇలాంటి టోర్నీలు బాగా ఉపయోగపడుతాయి. మహిళా క్రికెటర్‌లు భవిష్యత్తులో మరింత రాణించేందుకు దోహద పడుతాయని చెప్పొచ్చు. అలాగే ఇండియా, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, థాయిలాండ్‌తో పాటు మరో రెండు జట్లతో మహిళల ఆసియాకప్‌ టి20 టోర్నీని కూడా త్వరలో నిర్వహించనున్నాం. ఈ టోర్నీలో పాల్గొనబోయే మిగిలిన రెండు జట్లను ఏసీసీ టి20 చాంపియన్‌లో ఫైనల్‌ చేరే రెండు జట్లుగా ఉంటాయి. ఆల్‌ది బెస్ట్‌''  అంటూ ట్వీట్‌ చేశాడు. 

చదవండి: Viral Video: క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌ చూసి ఉండరనుకుంటా!

 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్‌ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top