పేరు, జెర్సీ మారినా ఇంకా హార్ట్‌ ఎటాక్‌ తెప్పిస్తున్నారు!

 Punjab Will Not Stop Giving Heart Attacks, Preity Zinta - Sakshi

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజస్‌లో కొత్త జెర్సీ, పేరులో స్వల్ప మార్పుతో బరిలోకి  దిగిన జట్టు పంజాబ్‌ కింగ్స్‌. గత సీజన్‌ వరకూ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌గా ఉన్న ఆ జట్టు.. ఈసారి తమ అదృష్టాన్ని  పరీక్షించుకునే క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌(పీబీకేఎస్‌)గా మార్చుకుంది.  2020 సీజన్‌లో భారీ స్కోర్లు చేసినా ఆ జట్టు ఓటమి పాలవడం యాజమాన్యంలో ఆందోళన రేకెత్తించింది. దాంతో పేరు మార్చుకుని మరీ ఈ ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు.  కాగా, సోమవారం పంజాబ్‌ కింగ్స్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.  

పంజాబ్‌ 221 పరుగులు చేసినా దాదాపు ఓడిపోయే స్థితి నుంచి బయటపడి చివరకు గెలుపుతో హమ్మయ్యా అనుకుంది. టీవీల ముందు కూర్చొన్న ప్రేక్షకుల్లో అక్కడ కామెంటరీ చెప్పేవాళ్లు కూడా పంజాబ్‌ పేరు మారినా రాత మారదా అంటూ చమత్కరించే పరిస్థితి నుంచి తేరుకుని విజయంతో శుభారంభం చేసింది. జట్టు కో-ఓనర్‌, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జట్టు పేరు, జెర్సీ మారినా ఇంకా హార్ట్‌ ఎటాక్‌లు తెప్పిస్తున్నారు అంటూ ట్వీటర్‌ వేదికగా స్పందించారు.

ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ప్రశంసిస్తూనే.. ఇంకా హార్ట్‌ ఎటాక్‌ తెప్పిస్తూనే ఉంటారా? అని ప్రశ్నించారు. ‘ వాటే గేమ్‌. మేము కొత్త జెర్సీ-కొత్త పేరుతో ఈ ఐపీఎల్‌ను ఆరంభించాం. అయినా గేమ్‌ ద్వారా మాకు హార్ట్‌ ఎటాక్‌లు తెప్పించడం ఆపలేదు.  ఇది కచ్చితంగా మాకు పర్‌ఫెక్ట్‌ గేమ్‌ కాదు.  కానీ చివరి అంకంలో కాస్త ఫర్‌ఫెక్ట్‌గా అనిపించారు’ అని ట్వీట్‌ చేశారు. 

ఇక్కడ చదవండి: అత్యధిక సెంచరీ వీరులు వీరే.. సెహ్వాగ్‌ సరసన సామ్సన్‌

సకారియా సక్సెస్‌ వెనుక ఓ విషాద గాధ..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top