Ind Vs Aus 3rd Test: నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు! కళ్లన్నీ అతడిపైనే..

Ind Vs Aus 3rd Test: Virat Kohli KL Rahul Others Sweat It Out In Nets - Sakshi

India Vs Australia 2023 Test series: స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఇండోర్‌ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. టీమిండియా ఆటగాళ్లు ఇందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, అంచనాల మేరకు రాణించలేకపోయిన విరాట్‌ కోహ్లి ప్రాక్టీసులో చెమటోడుస్తున్నారు.

అద్భుత ఫామ్‌లో ఉన్న స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ సహా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లతో కలిసి ప్రాక్టీసు చేస్తున్నారు. వీరితో పాటు స్పీడ్‌స్టర్లు మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌ సైతం ట్రెయినింగ్‌ సెషన్‌లో పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. కాగా మార్చి 1 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇక తొలి రెండు టెస్టుల్లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌(మొత్తంగా 38) దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.

కళ్లన్నీ అతడిపైనే
ఈ క్రమంలో అతడిని జట్టు నుంచి తప్పించాలని, యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు చోటివ్వాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌లో ఒక్క అర్ధ శతకం కూడా బాదలేకపోయిన రాహుల్‌ను కొనసాగించడం పట్ల బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి కళ్లు రాహుల్‌పైనే ఉన్నాయి. ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న వేళ అతడిని కొనసాగిస్తారా లేదంటే.. తప్పిస్తారా అన్న అంశంపై చర్చ నడుస్తోంది.

చదవండి: Kane Williamson: పార్ట్‌టైమ్‌ పేసర్‌ చేతికి చిక్కి.. తొలి బాధితుడిగా.. పాపం కేన్‌ మామ! వీడియో వైరల్‌
Viral Video: శార్దూల్‌ ఠాకూర్‌ ప్రీ వెడ్డింగ్‌ ఫంక్షన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ రచ్చ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top