
రింకూ సింగ్, నితీష్ రాణా (ఫోటో సోర్స్: IPL/BCCI)
ఐపీఎల్-2022లో వరుస ఐదు ఓటముల తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం నమోదు చేసింది. సోమవారం వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే కేకేఆర్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 153 పరుగుల లక్ష్య చేధనలో నితీష్ రాణాతో కలిసి రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్‌లో 23 బంతుల్లో 42 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా రింకూ నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడుతూ.. ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో తన సత్తా చాటేందుకు అవకాశాలు కోసం ఎంతో ఎదురు చూసినట్లు అతడు తెలిపాడు. 2018లో ఐపీఎల్‌లో రింకూ అరంగేట్రం చేసినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 13 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
“అలీఘర్‌లో చాలా మంది ఆటగాళ్లు రంజీ క్రికెట్ ఆడారు, కానీ ఐపీఎల్‌లో ఆడిన మొదటి వ్యక్తిని నేనే. ఐపీఎల్ ఒక మెగా టోర్నీ, చాలా ఒత్తిడి ఉంటుంది. గత ఐదేళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. నేను చాలా కష్టపడ్డాను. గాయం నుంచి కోలుకుని తిరిగి దేశీవాళీ టోర్నీల్లో ఆడాను. అక్కడ కూడా బాగా రాణించాను. ఈ మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేస్తున్నుప్పుడు రాణా భయ్యా, కోచ్ మెకల్లమ్ నన్ను చివరి వరకు ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయమని చెప్పారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో రింకూ సింగ్ పేర్కొన్నాడు. ఇక రింకూ సింగ్ డొమాస్టిక్ సర్క్యూట్‌లో ఉత్తర్‌ప్రదేశ్ తరపున ఆడుతున్నాడు.
చదవండి: IPL 2022: ఏంటి ప్రసిద్ధ్.. త్రో చేయాల్సింది బౌల్ట్‌కు కాదు.. వికెట్లకు..!
Rinku Singh knew he would win it for KKR even before the game 👏
— ESPNcricinfo (@ESPNcricinfo) May 2, 2022
(via @KKRiders) | #KKRvRR | #IPL2022 pic.twitter.com/7clbeQ8rdY