source: X
భారత్ పర్యటనలో పాల్గొనే ఇంగ్లండ్ మహిళల 'ఏ' జట్లను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇవాళ ప్రకటించింది. టీ20, 50 ఓవర్లు, నాలుగు రోజుల మ్యాచ్ల కోసం మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. మూడు జట్లకు కెప్టెన్లను తర్వాత ప్రకటించనున్నారు.
నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 22తో ముగియనున్న ఈ పర్యటనలో మొత్తం (మూడు ఫార్మాట్లలో) ఏడు మ్యాచ్లు జరగనున్నాయి. స్టార్ ప్లేయర్లు ఇస్సీ వాంగ్, టిల్లీ కార్టీన్-కోల్మన్, లారెన్ ఫైలర్ ఈ జట్లలో చోటు దక్కించుకున్నారు.
భారత్-ఏతో టీ20లకు ఇంగ్లండ్ జట్టు
హన్నా బేకర్, గ్రేస్ బాలింగర్, కిరా చాథ్లీ, టిల్లీ కార్టీన్-కోల్మన్, లారెన్ ఫైలర్, జోడీ గ్రూకాక్, బెస్ హీత్, నియామ్ హాలండ్, ఎమ్మా జోన్స్, రైనా మెక్డొనాల్డ్-గే, చారిస్ పావెలీ, గ్రేస్ పాట్స్, జెమీమా స్పెన్స్, గ్రేస్ థాంప్సన్, మేడీ విలియర్స్, ఇస్సీ వాంగ్.
50 ఓవర్ల జట్టు
హన్నా బేకర్, గ్రేస్ బాలింగర్, కిరా చాథ్లీ, టిల్లీ కార్టీన్-కోల్మన్, లారెన్ ఫైలర్, కేటీ జార్జ్, జోడీ గ్రూకాక్, బెస్ హీత్, నియామ్ హాలండ్, ఎమ్మా లాంబ్, రైనా మెక్డొనాల్డ్-గే, చారిస్ పావెలీ, గ్రేస్ పాట్స్, గ్రేస్ స్క్రివెన్స్, ఎల్లీ థ్రెల్కెల్డ్, మేడీ విలియర్స్, ఇస్సీ వాంగ్.
నాలుగు రోజుల మ్యాచ్కు జట్టు
హన్నా బేకర్, గ్రేస్ బాలింగర్, కిరా చాథ్లీ, టిల్లీ కార్టీన్-కోల్మన్, లారెన్ ఫైలర్, కేటీ జార్జ్, జోడీ గ్రూకాక్, బెస్ హీత్, ఎమ్మా లాంబ్, చారిస్ పావెలీ, గ్రేస్ పాట్స్, గ్రేస్ స్క్రివెన్స్, ఎల్లీ థ్రెల్కెల్డ్, మేడీ విలియర్స్, ఇస్సీ వాంగ్.
ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్ విజేతలను అభినందించిన ప్రధాని మోదీ


