నాలుగేళ్ల తర్వాత అశ్విన్‌కు వికెట్‌; బుమ్రా 925 రోజుల నిరీక్షణకు తెర

Ashwin Took ODI wicket 4 long Years Bumrah End Powerplay Drought 925 Days - Sakshi

టీమిండియా ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో వికెట్‌ సాధించాడు. 2017లో వెస్టిండీస్‌తో చివరిసారి వన్డే ఆడిన అశ్విన్‌.. తాజాగా నాలుగేళ్ల తర్వాత సాతాఫ్రికాతో మ్యాచ్‌ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికా బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేయడం ద్వారా వికెట్‌ సాధించాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ తొలి బంతిని అశ్విన్‌ రౌండ్‌ ది వికెట్‌ వేయగా.. డికాక్‌ కట్‌షాట్‌ ఆడాలని భావించాడు. అయితే గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన బంతి డికాక్‌ బ్యాట్‌ను మిస్‌ అయి మిడిల్‌ స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో డికాక్‌ 27 పరుగులు చేసి ఔటయ్యాడు.

చదవండి: 'బులెట్‌ వేగం'తో మార్క్రమ్‌ను దెబ్బకొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌

925 రోజుల నిరీక్షణకు తెర..
బుమ్రా పవర్‌ ప్లేలో ఎట్టకేలకు వికెట్‌ సాధించాడు.  దాదాపు 925 రోజుల పాటు పవర్‌ ప్లేలో బుమ్రాకు వికెట్‌ దక్కలేదు. బుమ్రా చివరిసారి 2019 వన్డే వరల్డ్‌కప్‌ సందర్భంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ను పవర్‌ప్లేలో ఔట్‌ చేశాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఇన్నింగ్స్‌ 5వ ఓవర్లో జానేమన్‌ మలాన్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఆ నిరీక్షణకు తెరపడింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్‌ బవుమా 93, డుసెన్‌ 71 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: షేన్ వార్న్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలకు పాక్‌ మాజీ కెప్టెన్‌ కౌంటర్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top