
ఉద్యాన పంటలు సాగు చేయాలి
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు
జహీరాబాద్: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసుకుని లబ్ధి పొందాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు సూచించారు. కోహీర్ మండలంలోని పిచరాగడి గ్రామంలో ఉద్యాన పంటల సాగుపై గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. అరటి, బొప్పాయి, అల్లం, ఆయిల్‌పామ్‌ను సాగు చేసుకున్న వారిని ప్రోత్సహించేందుకు సబ్సిడీ అందిస్తోందన్నారు. డీడీఎస్–కేవీకే శాస్త్రవేత్తలు వరప్రసాద్, శైలజ, దక్షిణ భారత నెటాఫిమ్ ఆగ్రోనమిస్ట్ ఎ.సుబ్బారావు, ఉద్యాన అధికారి సునీత, వ్యవసాయ శాఖ అధికారి వినోద్‌కుమార్‌లు ఉద్యాన పంటల సాగు యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు.