
దోస్త్‌ను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట ఎడ్యుకేషన్: డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులకు దోస్త్ అడ్మిషన్ ప్రక్రియ తోడ్పాడుతుందని, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అన్నారు. శుక్రవారం కళాశాలలో దోస్త్ అడ్మిషన్‌ల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (అటానమస్) కళాశాల 1956 లో ప్రారంభమై ఎంతోమంది విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిందన్నారు. కళాశాల, న్యాక్ ఏ+గ్రేడ్ కలిగి ఉండి, ఐఎస్‌ఓ గుర్తింపు పొంది స్వయం ప్రతిపత్తి కలిగిన ఏకైక కళాశాల అన్నారు. అన్ని వసతులతో కూడిన ల్యాబ్స్, పీహెచ్‌డీ, నెట్, సెట్‌లు పూర్తి చేసిన అనుభవం గల అధ్యాపకులతో విద్యా బోధన ఉంటుందని దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా కళాశాలను ఎంచుకోవా లన్నారు. అడ్మిషన్ ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే కళాశాలలోని దోస్త్ జిల్లా సహాయ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, డాక్టర్ గోపాల సుదర్శనం, దోస్త్ కో ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్, డాక్టర్ శ్రీధర్, మధుసూదన్ రెడ్డి, గురుమూర్తి, దోస్త్ టెక్నికల్ అసిస్టెంట్ మహేశ్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత