
అమ్మానాన్నల కల సాకారం
తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా సాహితీ
నంగనూరు(సిద్దిపేట) : సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రానికి చెందిన మల్యాల సాహితీ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంలోనే.. 26 ఏళ్ల వయస్సులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఉద్యోగం సాధించింది.
సాహితీ సిద్దిపేట పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్ చదివింది. బెంగుళూరులోని రెవా యూనివర్సిటీలో 2017–22 వరకు బీబీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. 2022–24 వరకు హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎమ్ పూర్తి చేయగా అంతలోనే జూనియర్ సివిల్ జడ్జి నియామకాలకు నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 2024లో ప్రిలిమ్స్, నవంబర్‌లో జరిగిన మెయిన్స్‌లో అర్హత సాధించింది. ఏప్రిల్ 2025లో ఇంటర్వ్యూలు అయ్యాయి. అదే నెల 30న జూనియర్ సివిల్ జడ్జి నియామకాలకు సంబంధించి ఫలితాలు విడుదల కాగా మల్యాల సాహితీ ఎంపికై ంది. జడ్జిగా ఎంపిక కావాలని పట్టుదలతో సాహితీ 10 నెలల పాటు కష్టపడింది. ప్రతి రోజూ 8 నుంచి రాత్రి 10 గంటల పాటు ఇంటి దగ్గరనే సన్నద్ధమైంది. పుస్తకాల నుంచి తానే సొంతంగా స్టడీ మెటీరియల్‌ను సిద్ధం చేసుకుంది.