
ఖేడ్ డిపోకు మరో పది బస్సులు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోకు త్వరలో మరో పది కొత్త బస్సులు రానున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ నుంచి కంకోల్ వరకు నూతన బస్సు సర్వీసును ఆదివారం మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయం వద్ద ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మరో పది బస్సులు కావాలని కోరగా కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. కరస్‌గుత్తి నుంచి డోవూర్, మనూర్‌ల మీదుగా సికింద్రాబాద్‌కు , జహీరాబాద్, బీదర్ రూట్లలో, జహీరాబాద్ నైట్‌హాల్ట్ బస్సును పునరుద్ధరించాలన్నారు. కంగ్టి, తడ్కల్ మీదుగా హైదరాబాద్‌కు బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లన్న, డీఎం మల్లేశయ్య, పూజారులు పాల్గొన్నారు.