
రికార్డులను పరిశీలిస్తున్న కమిషనర్
న్యాల్‌కల్(జహీరాబాద్): న్యాల్‌కల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం న్యాక్ (జాతీయ నాణ్యతా ప్రమాణాల లెక్కింపు) బృందం సందర్శించింది. ఉదయం ఆరోగ్య కేంద్రానికి వచ్చిన బృందం సభ్యులు ఆర్‌కె పట్ని, సాబేర్ పాటిల్ తదితరులు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, ఆస్పత్రిలో ప్రసవాలు, మందుల పంపిణీ ఎలా ఉంది? ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రత తదితర అంశాలను బృందం సభ్యులు పరిశీలించారు. జాతీయ ప్రమాణాలకు సంబంధించిన అన్ని అంశాలను బృందం సభ్యులు తెలుసుకున్నారు. పరిశీలించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని బృందం సభ్యులు తెలిపారు. వారి వెంట వైద్యురాలు స్వేతప్రియ, సిబ్బంది మార్తా తదితరులు ఉన్నారు.
ఆరోగ్య మహిళా కేంద్రం తనిఖీ
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కేంద్రాన్ని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మొహంతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది పని తీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రికార్డులను, సిబ్బ ంది హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గాయత్రి, డీప్యూ టీ డీఎంహెచ్‌ఓ నాగనిర్మల పాల్గొన్నారు.
తారా కళాశాలలో
న్యాక్ బృందం
కొండాపూర్(సంగారెడ్డి): జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం రెండో రోజు కూడా సందర్శించింది. మంగళవారం తారా కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యాక్రమాల్లో భాగంగా తెలంగాణ బోనాలు, బతుకమ్మ. జానపద నృత్యాలు ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల పట్ల న్యాక్ త్రిసభ్య కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రత్నప్రసాద్ తెలిపారు. రెండో రోజు న్యాక్ త్రిసభ్య కమిటీ సభ్యులు కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సహ పాఠ్యాంశాలను పరిశీలించారు. కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, ఏకో క్లబ్, రెడ్ రిబ్బన్ క్లబ్, ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్, ఐసీసీ, వాటర్ హార్వెస్టింగ్, వర్మీ కంపోస్ట్ ఏర్పాటు, జిమ్, స్పోర్ట్స్, ఆటలు వంటి సదుపాయాలను పరిశీలించి, రికార్డులనుయ తనిఖీ చేశారు. ఆర్వో వాటర్ ప్లాంట్, గ్రీన్ లైబ్రరీ, బొటానికల్ గార్డెన్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ముగిసిన ఇంటర్
ప్రథమ సంవత్సర పరీక్షలు
కొండాపూర్(సంగారెడ్డి): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. పరీక్షల్లో చివరి రోజైన మంగళవారం ప్రథమ సంవత్సరం సీఈసీ విద్యార్థులకు కామర్స్, ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు రసాయన శాస్త్రం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 19,785 మంది విద్యార్థులకు 18,834 మంది హాజరు కాగా 951 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్‌రాం తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల శాతం 95.19గా నమోదైంది. డీఐఈఓ మూడు, డీఈసీ సభ్యులు ఐదు, హెచ్‌పీసీ సభ్యులు ఐదు, ప్లయింగ్ స్క్వాడ్స్ ఎనిమిది, సిట్టింగ్ స్క్వాడ్లు నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

న్యాల్‌కల్ ఆస్పత్రి ఆవరణను పరిశీలిస్తున్న బృందం సభ్యులు

రికార్డులను పరిశీలిస్తున్న సభ్యులు