
గాయపడిన స్రవంతి
రామాయంపేట(మెదక్): వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండల పరిధిలోని ప్రగతిధర్మారం గ్రామానికి చెందిన చౌకి స్రవంతి మంగళవారం తన ఇంట్లో పడుకొని ఉండగా, అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమైపె దాడిచేసి కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అరుపులతో సదరు యువకుడు పారిపోయాడు. గాయపడిన స్రవంతిని చికిత్స నిమిత్తం 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రసుత్తం ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. పరారీలో ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎస్‌ఐ రంజిత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.