
కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఇంగ్లిష్ ఫారెన్ యునివర్సీటీ (ఇప్లూ)లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ హెచ్‌ఎస్ ఇందిరానగర్‌కు చెందిన 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు విభాగాలుగా ప్రెంచ్, స్ఫానిష్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ క్లాస్‌లకు హాజరయ్యారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఇప్లూ వైస్ ఛాన్స్‌లర్ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో నెల రోజులుగా ఇందిరానగర్ పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లిష్ భాషలను బోధించారు. విద్యార్థులతో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు పాలసాయిరాం, జిల్లా సెక్టోరియల్ అధికారి రామస్వామి, ఇందిరానగర్ పాఠశాల హెచ్‌ంఎ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.