ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు
ఇబ్రహీంపట్నం: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని ఆర్డీఓ అనంతరెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్, సామగ్రి, అధికారుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడు తూ.. పోలింగ్ కేంద్రాలకు వచ్చే మెటీరియల్‌ను సర్దుబాటు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. వార్డులు, బూత్‌ల వారీగా బ్యాలెట్ బాక్స్‌లు పరిశీలించారు. అధికారులు ఎన్నికల డ్యూటీలో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించేందుకు వచ్చే బస్సులను ఎక్క డ నిలపాలి తదితర అంశాలను పరిశీలించారు. ఆ యన వెంట ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ ఉష, సూపరింటెండెంట్ యెల్లంకి జంగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.
ఆర్డీఓ అనంతరెడ్డి


