విమానం ఎగురాను వచ్చు..!
గోదావరిఖని: మారుమూల అంతర్గాం ప్రాంతంలో విమానం ఎగురాను వచ్చు.. పల్లెవాసులు ఫ్లైట్‌లో పట్టణాలు, నగరాలు, మహానగరాలే కాదు.. దేశవిదేశాలు చుట్టిరానూ వచ్చు. ఇందుకు ప్రభుత్వం మార్గం సుగమమం చేయడంలో నిమగ్నమైంది. ప్రీ ఫిజిబిలిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు కేటాయించగా.. పెద్దపల్లి ఎంపీ చొరవతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రతినిధులు బుధ లేదా గురువారాల్లో అంతర్గాం ప్రాంతంలో పర్యటించనున్నారు. దీంతో జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
అంతర్గాంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు
బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా అంతర్గాం మండల కేంద్రం సమీపంలో ఉన్న 591ఎకరాల భూమిలో కొత్తగ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈక్రమంలో ఏఏఐ అధికారులు సర్వేకోసం వచ్చేందుకు రెండునెలల కిందటే సుమారు రూ.50 లక్షలు ఎయిర్‌పోర్టు అ థారిటీ ఆఫ్‌ఇండియాకు ప్రీ ఫిజిబులిటీ స్టడీ కోసం నిధులు చెల్లించింది. దీనిద్వారా కొత్త ఎయిర్‌పోర్టుకు ఏర్పాటుకు ముందడుగు పడినట్లయ్యింది.
బసంత్‌నగర్‌లో మినీ విమానాశ్రయం..
బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో చిన్నవిమానాల రాకపోకల కోసం యాజమాన్యం సొంతంగా మినీ ఎయిర్‌పోర్ట్ నిర్మించుకుంది. ఆ తర్వాత 1980లో ఎయిర్‌స్ట్రిప్ ద్వారా వాయుదూత్ సంస్థ కొన్ని విమాన సర్వీసులు నడిపించచింది. కారణా లు తెలియదుకానీ.. ఆ సంస్థ సేవలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మరోవైపు.. కొత్తగా విమానా శ్రయం ఏర్పాటు కోసం గతంలో అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. గుట్టలు, ల్యాండింగ్, టేకాఫ్ సందర్భంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉండడం, ఇండియర్ ఎయిర్‌ఫోర్స్ రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఉండడంతో బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్ట్ ఏ ర్పాటు సాధ్యంకాదని స్పష్టం చేశారు.
వీటిపై అధ్యయనం..
అంతర్గాం ప్రాంతంలో పర్యటించే ఏఏఐ బృందం.. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అనుకూల, ప్రతికూల పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. ప్రధానంగా అవసరమైన భూమి, రన్‌వే, టెర్మినల్ నిర్మాణం, భౌగోళిక పరిస్థితులు, రవాణా, కనెక్టివిటీ, భవిష్యత్ అవసరా లు తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే.. బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు సాధ్యం కాదని ఏఏఐ టెక్(టెక్నో ఎకనామీ ఫిజిబులిటీ రిపోర్టు) నివేదిక వెల్లడించిన నేపథ్యంలో.. కొత్త ప్రాజెక్ట్‌పై ‘ఫిజిబులిటీ రిపోర్ట్’ సానుకూలంగా వస్తుందా, ప్రతికూలంగా ఉంటుందా? అనేదానిపై పారిశ్రామిక ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది.
గంటల్లోనే విదేశాలకు..
అంతర్గాం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటైతే.. హైదరాబాద్, ఢిల్లీతోపాటు దేశ, విదేశాలకూ గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. కరీంనగర్, మంచిర్యా ల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, ఆ సిఫాబాద్ తదితర జిల్లాలవాసులకు విమాన ప్ర యాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్, కేశోరాం ఉద్యో గులు, అధికారుల రాకపోకలు సులభతరమవుతా యని భావిస్తున్నారు. రోడ్డు మార్గంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. పెట్టుబడులు తరలివచ్చి పరిశ్రమలు, పరిశోధనలు, హౌసింగ్, వాణి జ్యం వంటి రంగాలు అభివృద్ధి చెందుతాయి.
ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు మరోముందడుగు
నేడు లేదా రేపు అంతర్గాంకు ఏఏఐ ప్రతినిధులు
ప్రీ ఫిజిబిలిటీ కోసం రూ.50 లక్షలు విడుదల
అభివృద్ధికి అవకాశం
పారిశ్రామిక హబ్ రామగుండం. ఇక్కడ ఎయిర్‌పో ర్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. మంగళ, లేదా బుధ వారాల్లో ఏఏఐ ప్రతినిధులు స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఇక్కడ పర్యటించి ఫిజిబులిటీ నివేదిక ఇస్తారు.
– రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం
ఎయిర్‌పోర్టు సాధిస్తాం
అంతర్గాంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు అయ్యేంత వరకూ పోరాటం చేస్తా. ఇప్పటికే పౌరవిమానయాన మంత్రి రాంమోహన్‌నాయుడికి విజ్ఞ ప్తి చేశాం. ఈక్రమంలో ఏఏఐ ప్రతినిధుల రాక ప్రాధాన్యతను సంతరించుకుంది.
– వంశీకృష్ణ, ఎంపీ, పెద్దపల్లి
విమానం ఎగురాను వచ్చు..!
విమానం ఎగురాను వచ్చు..!


