గెలుపే ధ్యేయంగా..
సాక్షి పెద్దపల్లి: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రా జకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నా యి. పార్టీ రహితమైనా.. తమ పార్టీ మద్దతుతో అ భ్యర్థులను గెలిపించుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ప్రత్యర్థులను తట్టుకొనే వారికోసం అన్వేషి స్తున్నాయి. బలాలు, బలహీనతలు, సామాజికవర్గా ల మద్దతు తదితర కోణాల్లో ఆరా తీస్తున్నాయి.
నేడు తొలివిడత నామినేషన్ల
ఉపసంహరణకు గడువు
తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ గడవు బుధ వారం ముగియనుంది. మంగళవారం రెండోవిడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మూడో విడత నామినేషన్లు స్వీకరణ బుధవారం ప్రారంభంకానుంది. పల్లెలో ఎన్నికల హడావుడి పెరిగింది. పార్టీల మద్దతుతో పోటీచేసే వారు తమ నేతల తో ప్రచారం హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.
జనరల్ స్థానాల్లో పోటీతీవ్రం..
రిజర్వేషన్ స్థానాలతో పోల్చితే.. జనరల్ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. మూడుప్రధాన పార్టీల్లో జనరల్ స్థానాల నుంచి ముఖ్యనేతలు బరిలో దిగేందు కు సిద్ధంగా ఉన్నారు. అయితే, జనరల్ స్థానాల్లో అ భ్యర్థుల ఎంపిక పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. పార్టీ పరంగా 42శాతం బీసీలకు కేటాయిస్తామ న్న కాంగ్రెస్‌లో.. జనరల్ స్థానంలో అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారింది.
హస్తం పార్టీలో ఎమ్మెల్యేలపైనే భారం
స్థానిక ఎన్నికల్లో 80 శాతం కాంగ్రెస్ మద్దతుదారు లే విజయం సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యేలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన పట్టుతో పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం ఎత్తు లు వేస్తున్నారు. సర్పంచ్ తర్వాత జెడ్పీ, మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎలాగైనా మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు చేరికలను ప్రో త్సహిస్తూ బుజ్జగింపులకు దిగుతున్నారు.
సాధ్యమైనన్ని సీట్లు గెలవాలని ..
ఎంపీ ఎన్నికల్లో సాధించిన ఓట్లను స్ధిరమైన ఓటు షేర్‌గా మార్చుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నా రు. అధికార పార్టీకి ధీటుగా తమ మద్దతుదారుల ను అన్నిస్థానాల్లో నిలిపేలా కార్యాచరణ చేపట్టింది. మాజీఎమ్మెల్యే గుజ్జుల రామకృస్ణారెడ్డి ముఖ్యకార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ముఖ్యకార్యకర్తల సమ్మతితోనే అభ్యర్థిని బరిలో దించేలా కమళదళం సమయాత్తమవుతోంది. గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతోనే పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర ప్రభుత్వంతో పల్లెలకు వచ్చిన పథకాలు, ప్ర యోజనాలను వివరిస్తూ ముందుకెళ్లాలని నిర్ణయించింది.
రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా..
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోపాటు గ్రామస్థాయి ప్రజా సమస్యలను లేవనెత్తి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు చూపించి విజ యం సాఽధించేలా బీఆర్‌ఎస్ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే దీక్షాదివస్‌తో పేరిట పార్టీ శ్రేణులకు పంచాయతీ ఎన్నికల్లో దిశానిర్దేశం చేసింది. పంచాయతీల వారీగా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన అ సంతృప్తి శ్రేణులను తమ పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేక దృషి సారించింది.
గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల ప్రణాళిక
80 శాతం స్థానాలు దక్కించు కునేలా కాంగ్రెస్ కసరత్తు
సాధ్యమైనన్ని సీట్లలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం
ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ రంగంలోకి..
పల్లెల్లో ఊపందుకున్న స్థానిక ఎన్నికల ప్రచార పర్వం


