5న జాబ్‌మేళా
పెద్దపల్లి: టాస్క్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఈ నెల 5న జాబ్ మేళా నిర్వహిస్తామని కలెక్టర్ కో య శ్రీహర్ష తెలిపారు. ఐటీ, ఐటీయేతర రంగా లకు చెందిన 15 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. డిగ్రీ, బీటెక్, పీజీ, ఐటీఐ, డి ప్లొమా కోర్సులు పూర్తిచేసి, 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు 3 నుంచి 4 సెట్ల రెజ్యూమె కాపీలతో హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.
జాప్యం లేకుండా సేవలు
రామగిరి(మంథని): కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సేవలు జాప్యం లేకుండా అందిస్తున్నా మని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్లు హరిపచౌరీ, గోవర్ధన్ అన్నారు. సింగరేణి ఆర్జీ–3 జీఎం కార్యాలయంలో మంగళవారం ప్రయాస్ కార్యక్రమంపై వారు అవగాహన కల్పించారు. తొ లుత ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగుల రివైజ్డ్ పింఛన్ పేమెంట్ 515 పీపీవో ఆర్డర్స్‌కాపీలను పర్సనల్ విభాగాధిపతి సుదర్శనంకు అందజే శా రు. సీనియర్ పీవోలు రాజేశం, రవిచంద్ర, ఫై నాన్స్ అధికారి భరత్, సిబ్బంది అనిత, మనోహర్, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకోపైలెట్ల ఉపవాసదీక్ష
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్‌లో లోకోపైలె ట్లు మంగళవారం ఉపవాస దీక్ష చేపట్టారు. వా రాంతపు విశ్రాంతి, కిలోమీటరుపై అలవెన్స్, పదోన్నతులు కల్పించాలని, రైలింజన్లలో ఏసీ లు బిగించాలని డిమాండ్ చేవారు. లోకోపైలె ట్లు సీహెచ్ రవి, సచిన్, వినయ్, వినోద్, రుద్ర చారి, శ్రవణ్, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్చరీ పోటీలకు ఎంపిక
కమాన్‌పూర్(మంథని): రంగారెడ్డి జిల్లా కొల్లాపూర్‌లో ఈనెల 7న జరి గే సీనియర్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు మట్ట రమేశ్, మచ్చ సహస్ర ఎంపికయ్యారు. రామగిరి మండలం సెంటనరీకాలనీలోని రాణిరుద్రమదేవి మైదానంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో వీరు ప్రతిభ కనమర్చినట్లు కోచ్ రవి, ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్ తెలిపారు.
ఎన్టీపీసీ ప్రాజెక్టు సందర్శన
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్టు ను సీఐఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజీ)ఎస్‌ఆర్ శరవణన్ మంగళవారం సందర్శించారు. రామగుండం యూనిట్ సీనియర్ కమాండెంట్ అరవింద్‌కుమార్ ఆయనకు పూలమొక్క అందించారు. రెండు రోజుల ఐజీ ఇక్కడ పర్యటిస్తారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులు, సిబ్బందితో భద్రత, రక్షణ చర్యలపై సమీక్షిస్తారు.
6న స్టేట్ సైన్స్ మీట్
రామగుండం: వికసిత్, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈనెల 6న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మోడల్ స్కూల్ విద్యార్థులకు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీచేసింది. రా ష్ట్రంలోని 194 స్కూళ్ల నుంచి 776 మంది విద్యార్థులు 388 ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రీన్‌ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నా లజీ స్, రిక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్, హెల్త్, హైజెనిక్, వాటర్ కన్జర్వేషన్, మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై ఆధునిక వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టాలని పేర్కొన్నారు.
విజ్ఞానం.. సాంకేతికం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ జెడ్పీ హై స్కూల్‌లో మంగళవారం జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని జెడ్పీ సీఈవో నరేందర్, డీఈవో శారద ప్రారంభించారు. వి ద్యార్థులు సైన్స్, టెక్నాలజీలో ముందుండాలని వారు సూచించారు. ఇక్కడ ప్రతిభ చూపిన ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని వివరించారు. జిల్లా అకడమిక్ అధికారి పీఎం షేక్, జిల్లా సైన్స్ అధికారి హనుమంతు, సెక్టోరియల్ ఆఫీసర్లు కవిత, మల్లేశ్, అజీమ్, ఎంఈ వోలు మల్లేశం, సురేంద్రకుమార్, హరిప్ర సా ద్, విమల, హెచ్‌ఎం రాంరెడ్డి పాల్గొన్నారు.
5న జాబ్‌మేళా
5న జాబ్‌మేళా
5న జాబ్‌మేళా


