బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
కొందరికి నష్టం.. అయినా, చాలామందికి సౌకర్యం.. అందుకే రామగుండం నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు రూ.29 కోట్ల వ్యయంతో రహదారులు, డెకోరేటెడ్ లైటింగ్ సిస్టం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అధునాతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రబిందువైన లక్ష్మీనగర్‌ను అందంగా రూపొందిస్తున్నారు. గతంలో ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని ఇరుకై న లక్ష్మీ నగర్, మేదరిబస్తీ, కల్యాణ్‌నగర్, మేకలమార్కెట్ ఏరియాలు సుందరంగా తయారవుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే గా మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ గెలిచాక నగరం రూపురేఖలు మారుతున్నాయని స్థానికులు కితాబివ్వడం గమనార్హం.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
‘ప్రగతి’లో పనులు
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


