పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు
పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికలకు పగడ్బందీ ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పంచాయతీ ఎ న్నికల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్‌లో స మీక్షించారు. రిటర్నింగ్, పోలింగ్ అధికారులు, సి బ్బందికి ఎన్నికలపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల సిబ్బందికి రెండోదశ సిబ్బంది ర్యాండమైజేషన్ పూ ర్తయ్యాక పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల ప్రకట న, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ ముద్రణ కు పక్కాగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూ చించారు. తొలివిడత పోలింగ్ గ్రామాలకు బ్యాలెట్ బాక్స్‌లు తరలించాలని చెప్పారు. 21 మందికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీచేసేందుకు నామినేషన్లు వేస్తే తమకు సమాచారం అందించాలని అ న్నారు. డీపీవో వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, డీసీవో శ్రీమాల ఉన్నారు.
బోధనా పద్ధతుల్లో మార్పులు అవసరం
ప్రభుత్వ పాఠశాలల్లో నెలరోజుల్లోగా బోధనా పద్ధతుల్లో మార్పులు రావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అకడమిక్ ప్యానెల్ బృందాల స్కూళ్ల పరిశీలనపై తన కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. తొలివిడతలో 30 ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 16 హైస్కూళను తనిఖీ చేశామన్నారు. ప్రతీ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలపై కనీసం 80శాతం అ వగాహన కలిగి ఉండాలని సూచించారు. అకడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్ పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


