
సమన్వయంతో పనిచేయాలి
మంథని: అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు సూచించారు. స్థానిక శివకిరణ్ గార్డెన్స్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో అభివృద్ధి పనులపై శ నివారం ఆయన సమీక్షించారు. భవిష్యత్ అవసరాలు, పీక్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వి ద్యుత్ సబ్‌స్టేషన్లు, అదనపు లైన్లు ఏర్పాటు చే యాలని సూచించారు. గంగదేవిపల్లిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి వారంలోగా శంకుస్థాపన చేయాలని, మచ్చుపేటలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలను ఎస్‌ఈ పరిష్కరించాలన్నారు. వచ్చే మూడు నెలలపాటు విద్యుత్ సరఫరా చాలాకీలకమని, అధికారులు అప్రమత్తం ఉండాలని సూచించారు. ఎ రువులు, విత్తనాలు రైతులకు అవసరమైనన్ని ఉ న్నాయని తెలిపారు. అర్హులకు రేషన్‌కార్డులు జారీచేయాలని, పైలెట్ ప్రాజెక్టు కింద ఒకరేషన్ షాప్ వద్ద సూపర్ మార్కెట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. మంథని ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని, గోదావరిఖని, పెద్దపల్లి లాంటి ప్రాంతాలకు రెఫర్ చేయొద్దని ఆదేశించారు. బ యోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని అన్నా రు. సబ్‌సెంటర్ల భవన నిర్మాణ పురోగతి, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని డీఎంహెచ్‌వోకు సూచించారు. పీహెచ్‌సీల్లో పరికరాలు, సామగ్రి అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌కు సూచించారు. తాగునీటి కోసం వారంరోజుల్లోగా మిషన్ భగీరథ, పాతవ్యవస్థ పునరుద్ధరించాలన్నారు. ఎస్సారెస్పీ కాలువల్లో ఈజీఎస్ ద్వారా ఏటా పూడిక తొలగించాలని అన్నారు. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల డీపీఆర్ పూర్తిచేయాలని, పో డు భూముల పట్టాలు ఉన్న రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. గ్రామాల్లో కొ త్త రూట్ల కనీసం 10 రోజులు బస్సులు నడపా లని అన్నారు. మంథని బస్టాండ్ ఆధునికీకరణ ప్రారంభించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ సామగ్రి ధరలు పెరగకుండా చూడాలన్నారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, రామగిరి మండలం సుందిళ్లలో సింగరేణి మైనింగ్ లీజ్ భూముల పరిహారం అర్హులకు అందించేందుకు ఎంజాయ్‌మెంట్ సర్వే చేశామన్నారు. జాతీయ ర హదారి పెండింగ్ భూ సేకరణ 80 శాతం అవార్డు పాస్ చేశామని తెలిపారు. అంతకుముందు రామగిరి, ముత్తారం, మంథని, మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళి అర్పించారు.
విద్యుత్ సమస్యలు తలెత్తవద్దు
పేషెంట్లను రెఫర్ చేసే పద్ధతి మానుకోండి
ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందవద్దు
పైలెట్ ప్రాజెక్టుగా రేషన్ షాపు వద్ద సూపర్ మార్కెట్
జిల్లా అధికారులతో మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష