
యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలి
● జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ ● అంతర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
పాలకుర్తి: క్రీడలతో శారీరక ధారుడ్యంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని, స్నేహభావం పెంపొందుతుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ పేర్కొన్నారు. బసంత్‌నగర్‌లో ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తండ్రి సత్యనారాయణ స్మారకార్థం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్‌జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు కౌశిక హరి, బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, కేశోరాం ప్లాంట్ హెడ్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.