గురి తప్పని పూర్ణచంద్‌ | - | Sakshi
Sakshi News home page

గురి తప్పని పూర్ణచంద్‌

Jun 5 2025 8:04 AM | Updated on Jun 5 2025 8:04 AM

గురి

గురి తప్పని పూర్ణచంద్‌

రామభద్రపురం: మండలంలోని కొత్తరేగ గ్రామానికి చెందిన కిలపర్తి పూర్ణచంద్‌ 9వ తరగతి చదువుతూ క్రీడారంగంలో రాణిస్తున్నాడు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ సాధించి దేశంలో జిల్లా కీర్తిని చాటాడు. ఈ కుర్రాడు 7వ తరగతి నుంచే పలుమార్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్‌ షిప్‌లలో పాల్గొని గోల్డ్‌, బ్రాంజ్‌, సిల్వర్‌ మెడల్స్‌ అందుకుని శభాష్‌ అనిపించుకున్నాడు. పథకాల్లో అధికశాతం గోల్డ్‌ మెడల్స్‌ అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల మార్చి నెలలో గుంటూరులో నిర్వహించిన జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో ఎన్‌టీపీసీ సంస్థ ద్వారా అండర్‌ 15 విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్‌ సాధించాడు. ఈ సందర్భంగా పూర్ణచంద్‌ను సంగారెడ్డి జిలా కలెక్టర్‌ క్రాంతి ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే 2021లో తమిళనాడులోని అండర్‌ 14 కేటగిరీలో జాతీయ ఇన్‌డోర్‌ ఆర్చరీ వ్యక్తిగత చాంపియన్‌ షిప్‌ గెలుచుకుని గోల్డ్‌మెడల్‌ సాధించాడు. ఇంకా బాలుర మిక్స్‌డ్‌ విభాగంలో బ్రాంజ్‌ మెడల్‌ గెలుచుకున్నాడు. 2024లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్‌ కై వసం చేసుకున్నాడు. కొత్తరేగ గ్రామానికి చెందిన కిలపర్తి మురళీకృష్ణ ప్రథమ సంతానం పూర్ణచంద్‌. మురళీకృష్ణ హైదరాబాద్‌లో ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. పూర్ణ చంద్‌ అక్కడే ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. 3వ తరగతి నుంచి ఆర్చరీ క్రీడలో రాణించేవాడు. ఆర్చరీ కోచ్‌ బండి స్వామి వద్ద శిక్షణ పొందుతూ ఆయన సలహాలు, సూచనలతో ముందుకెళ్తున్నాడు. అయా స్థాయిల్లో వివిధ పోటీల్లో పాల్గొని సుమారు 26 మెడల్స్‌, ట్రోఫీలు దక్కించుకున్నాడు. విద్యలో కూడా తరగతిలో టాప్‌ 5లో రాణిస్తున్నట్లు తండ్రి మురళీకృష్ణ తెలిపారు. పూర్ణచంద్‌కు మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఇండియన్‌ ఆర్మీ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం ఉచిత విద్యతో పాటు ఆర్చరీలో మరింత శిక్షణ ఇచ్చి ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకు వెళ్లారని తెలిపారు.

ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధనే లక్ష్యం..

నేను నా తల్లిదండ్రుల ప్రో త్సాహంతో ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పలుమార్లు పాల్గొని సు మారు 26 గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించాను. ఇండియన్‌ ఆర్మీ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుతో పాటు ఆర్చరీలో మరింత శిక్షణ పొంది ఒలింపిక్స్‌లో పాల్గొని మెడల్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.

కిలపర్తి పూర్ణచంద్‌, ఆర్చరీ క్రీడాకారుడు

ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు

అండర్‌ 15లో జాతీయస్థాయిలో రాణింపు

గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించిన క్రీడాకారుడు

ఆనందంగా ఉంది..

నా కొడుకు జాతీయస్థాయిలో గోల్డ్‌మెడల్‌ సాధించాడన్న సంతోషం కంటే మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఇండియన్‌ ఆర్మీ స్పోర్ట్స్‌’ ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం ఉచిత విద్యతో పాటు ఆర్చరీలో మరింత శిక్షణ ఇచ్చేందుకు తీసుకెళ్లడం మరింత ఆనందంగా ఉంది. 3వ తరగతి నుంచి బాబు ఆర్చరీ అంటే ఇష్టపడేవాడు. కోచ్‌ బండి స్వామి చక్కని శిక్షణతో పాటు సలహాలు సూచనలు ఇవ్వడంతో మరింత రాటు దేలాడు. అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్‌లో ప్రథమ స్థానం సాధించి మెడల్‌ గెలిస్తే మరెంతో సంతోషంగా ఉంటుంది. కిలపర్తి మురళీ కృష్ణ,

పాతరేగ, రామభద్రపురం మండలం

గురి తప్పని పూర్ణచంద్‌1
1/2

గురి తప్పని పూర్ణచంద్‌

గురి తప్పని పూర్ణచంద్‌2
2/2

గురి తప్పని పూర్ణచంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement